Bramhanandam performance details in memu saitham programme

brahmanandam comedy, brahmanandam comedy on memu saitham programme, brahmanandam solo performance on memu saitham, tollywood stars performance on memu saitham programme, memu saitham show tickets booking, pawan kalyan mahesh babu on memu saitham, memusaitham show venue details updates, tollywood latest news updates

bramhanandam performance in memu saitham programme : tollywood film industry comes together to help hudhud cyclone victims with memu saitham show. in memu saitham show brahmanandam will make 30minutes entertainment by his solo performance with a comedy track its a challange to brahmanandam to show 30 minutes comedy

ఛాలెంజ్ : ఒంటరిగా పోరాడుతున్నాడు

Posted: 11/21/2014 11:53 AM IST
Bramhanandam performance details in memu saitham programme

తెలుగు సినిమా కామెడి బ్రహ్మ మన బ్రహ్మానందం పెద్ద సవాల్ నే ఎదుర్కుంటున్నాడు. ఈ మద్య విశాఖ సహా ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన ‘హుద్ హుద్’ తుపాను బాధితులకు సాయం చేసే ఉద్దేశ్యంతో టాలీవుడ్ కళాకారులు చేపట్టిన ‘మేముసైతం’ కార్యక్రమంలో బ్రహ్మి కూడా పాల్గొంటున్నారు. అంతేకాదు., ఈ షోలో ఆయన ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని స్పష్టం అవుతోంది. ఎందుకంటే అరగంట పాటు సోలో పర్ ఫార్మెన్స్ ఇస్తారట. స్టేజ్ పై ఒక్కడే అరగంట పాటు నవ్విస్తానని చాలెంజ్ చేశాడు.

అరగంట పాటు ఒక్కరే స్టేజిపై ఉండి అందర్నీ నవ్వించటం అంటే పెద్ద సవాలే. అరగంట పాటు మాట్లాడాలి అంటేనే ఇబ్బంది పడతారు. అలాంటిది అవతలి వారిని నవ్వించేలా అరగంట పాటు ఒక్కరే ఏకధాటిగా నటించాలి అంటే చాలా కష్టం. కాని కామెడి కింగ్ మాత్రం కాంప్రమైజ్ కావటం లేదు. అయినా సరే ముప్పై నిమిషాలు ఒంటరిపోరాటం చేస్తానని చెప్తున్నాడు. మరి ఆ ముప్పై నిమిషాలు ఆయనేంచేయబోతున్నాడో తెలియాలంటే 30వ తేదీ వరకు ఆగాల్సిందే.

ఈనెల 30న జరిగే ‘మేముసైతం’ షోలో సినిమా హీరోలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా కళాకారులంతా ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ షోలో మహేష్-పవన్ కలిసి ఒక స్కిట్ చేస్తుండగా.., బాలయ్య-జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక స్కిట్ చేస్తారని తెలుస్తోంది. నందమూరి స్కిట్ కు బోయపాటి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమవంతుగా స్కిట్లు చేసి షోకు వచ్చిన డబ్బుతో తుఫాను బాధితులను ఆదుకుంటామని తెలిపారు. 30న జరిగే ఈ షో టికెట్లు ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ ద్వారా అమ్ముడవుతున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brahmanandam  solo  memu saitham  comedy  tollyood  

Other Articles