Why anisha ambrose selected for gabbar singh movie

gabbar singh2 heorine, anisha ambrose in gabbar singh2, why how anisha ambrose selected gabbar singh2, pawan selects anisha ambrose for gabbar singh2, gabbar singh2 shooting date, gabbar singh2 latest news updates, gabbar singh2 photos, gabbar singh2 second heroine, tollywood latest movie news updates, gopala gopala pawan kalyan venkatesh latest

why anisha ambrose selected for gabbar singh movie : all tollywood stars and fans shocked with anisha ambrose selection for gabbarsingh2 but movie unit saying there is a reason for selecting her into this project. gabbar singh2 movie shooting will start in december and will release by june 2015 says movie unit

అనీషాకు అవకాశం ఇవ్వటానికి కారణమిదేనట !

Posted: 11/22/2014 01:21 PM IST
Why anisha ambrose selected for gabbar singh movie

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘గబ్బర్ సింగ్2’లో హీరోయిన్ చాన్స్ కొట్టేసి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది అనీషా అంబ్రోస్. అప్పటివరకు టాలీవుడ్ ప్రముఖులకు కూడా సరిగ్గా తెలియని ఈ అమ్మాయి పవన్ సినిమా హీరోయిన్ పాపులర్ అయింది. ప్రస్తుతం అమ్మడి ఫేస్ బుక్ పేజికి లైక్ కొడుతున్న వారి సంఖ్యను చూస్తేనే ఇది అర్థం అవుతుంది. ఎంతోమంది హీరోయిన్లు ఆశగా ఎదురుచూస్తున్న చాన్స్ ను చప్పుడుకాకుండా వచ్చి కొట్టేసింది. దీంతో అసలు ఛాన్స్ ఎలా వచ్చిందా అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం కేవలం అభిమానుల కోసమే అనిషాను ఎంపిక చేశారని తెలుస్తోంది. అభిమానులు కోరుకున్నారని కాదు.., వెయిట్ చేయించవద్దు అని. ఇప్పటివరకు పవన్ చివరి మూవీ ‘అత్తారింటికి దారేది’ వచ్చి ఏడాది దాటింది. అభిమానులంతా పవన్ సినిమా కోసం ఆశగా ఆకలితో ఎదురుచూస్తున్నారు. అలాంటివారిని ఇంక వెయిట్ చేయించవద్దు అనే ఉద్దేశ్యంతో పవన్ సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కేవలం రెండు షెడ్యూల్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్ లో స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే.., అమ్మడు డేట్లు అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడవచ్చు.

ఇలా హీరోయిన్ కోసం ఫ్యాన్స్ ను వెయిట్ చేయించటం పవన్ కు ఇష్టం లేదు. కాబట్టి, సన్నిహితుల సలహా మేరకు కొత్త హీరోయిన్ తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశ్యంతో అనిషాను తీసుకున్నారట. అలా సీనియర్లపై నమ్మకం లేక.., తంతే బూరెల గంపలో పడినట్లుగా ఈ అమ్మడు ఒక్కసారి చాన్స్ కొట్టేసింది. మరి ఈ నమ్మకాన్ని ఏ మాత్రం కొనసాగిస్తుందో తెలియాల్సి ఉంది. బాబీ డైరెక్ట్ చేస్తున్ ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbar singh2  anisha ambrose  pawan kalyan  tollywood  

Other Articles