Baby shamili re entry into tollywood with glamour

baby shamili latest hot photso, baby shamili new glamour photos, baby shamili latest movies, baby shamili upcoming movies, baby shamili second movie updates, tollywood latest updates, ajith on baby shamili, baby shamili hot photoshoot

baby shamili re entry into tollywood with glamour : with debut got decent girl name but with second movie will prove glamour girl this is about actress baby shamili, oy movie heroine baby shamili again coming into tollywood with heavy expectations tollywood gossips that recently she completed photo shoot with glamour show

బావ మాట.., ఇక గ్లామర్ బాట

Posted: 11/22/2014 04:43 PM IST
Baby shamili re entry into tollywood with glamour

ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఎంతటివారయినా స్టార్ హీరోయిన్ కావాలంటే గ్లామర్ బాట పట్టక తప్పదు. కాదు, కూడదు అనుకుంటే.., ఆర్నెళ్ళు ఉందామనుకునే వారు కనీసం మూడు నెలలు కూడా ఉండలేరు. అంత ప్రభావం చూపుతుంది గ్లామర్. ఈ రహస్యం పాటించి చాలామంది హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్ క్రేజ్ తెచ్చుకోగా.., కొందరు ఇష్టం లేకపోయినా తప్పదు కదా అంటూ కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ గ్లామర్ మంత్రాను ప్రయోగించేందుకు ఒకప్పటి బేబి శామిలి.., ఇప్పటి ‘ఓయ్’ ఫేం రెడి అయిపోయింది.

చిన్నపుడు ముద్దు ముద్దు మాటలు, చిలిపి చేష్టలతో బేబి శామిలిగా ఆకట్టుకున్న ఈమె కొద్దికాలం సినిమాల్లో కన్పించలేదు. ఆ తర్వాత సడన్ సర్ ప్రైజ్ లా ‘ఓయ్’ సినిమాతో ఇండస్ర్టికి మళ్ళీ ముఖం చూపించింది. డీసెంట్, హోమ్లీ నటిగా పేరు తెచ్చుకుంది. చిన్న పిల్లగా వెళ్ళిన అమ్మాయి హీరోయిన్ గా ఎదిగి రావటంతో అంతా థ్రిల్ ఫీల్ కావటంతో పాటు., సాదరంగా ఆహ్వానించారు. అయితే ఒక సినిమా చేసి మళ్ళీ వెళ్ళిపోయిన ఈ తార.., ఇప్పుడు తిరిగి వస్తోంది. అది కూడా గ్లామర్ గర్ల్ గా కన్పించేందుకు సిద్దమయి సినిమాలు చేస్తుందని అంటున్నారు.

ఈ మద్యే శామిలి ఫోటో షూట్ చేసిందట. ఇందులో కొన్ని గ్లామరస్ గా ఉన్నాయని సన్నిహితులు చెప్తున్నారు. బావగారైన హీరో అజిత్ (శామిలి అక్క శాలిని భర్త) కూడా ప్రోత్సహించటంతో ఈ ఫొటోషూట్ చేసిందని అంటున్నారు. ఈ ఫొటోలు చూసిన కొందరు డైరెక్టర్లు శామిలికి కథలు కూడా విన్పిస్తున్నారట. వీటిలో త్వరలోనే కొన్నింటికి సైన్ చేసే అవకాశం ఉంది. అంటే అతి త్వరలో 35ఎం.ఎం. తెరపై బేబి శామిలిగా కన్పించిన అమ్మడు ఇప్పుడు గ్లామర్ గర్ల్ గా 70ఎం.ఎం. స్ర్కీన్ పై ఆకట్టుకోనుంది. అన్నట్లు ‘ఓయ్’ తర్వాత గ్యాప్ తీసుకోవటానికి కారణం ఏమిటంటే.. అప్పటికి చదువు పూర్తి కాకపోవటంతో.. ఆ సినిమా చేసి ఫారిన్ వెళ్ళి చదువు పూర్తి చేసి వచ్చిందట. ఇక స్టడీస్ అయిపోవటంతో సినిమాల మీదే ఫోకస్ పెట్టింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby shamili  glamour  hot photo shoot  tollywood  

Other Articles