Actress and producer jeevitha rajasekhar jailed for 2 years

Jeevitha Rajasekhar jailed, Jeevitha Rajasekhar in cheque bounce case, Jeevitha Rajasekhar controversy comments, Jeevitha Rajasekhar movies, Jeevitha Rajasekhar arrest, Jeevitha Rajasekhar jail judgement, Jeevitha Rajasekhar in cheque bounce case update, Jeevitha Rajasekhar latest updates, rajashekar latest movie updates, tollywood latest updates, erramanjil court

actress and producer Jeevitha Rajasekhar Jailed for 2 years : Jeevitha Rajasekhar has been ordered 2 years of jail in a cheque bounce case. Erramanjil court has orders Jeevitha for 2 years along with a fine of 25 lakhs

బ్రేకింగ్ : ‘జీవిత’ రాజశేఖర్ కు జైలు శిక్ష

Posted: 11/24/2014 02:56 PM IST
Actress and producer jeevitha rajasekhar jailed for 2 years

ఒకప్పటి నటి, ప్రస్తుత నిర్మాత జీవిత రాజశేఖర్ కు జైలు శిక్ష పడింది. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. తాజా సమాచారం ప్రకారం.., రాజశేఖర్ సినిమాల్లో ఒకటైన ‘ఎవడైతే నాకేంటి’ మూవీ లావాదేవీల్లో భాగంగా నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత చెక్కు ఇచ్చింది. అయితే అకౌంట్ లో డబ్బులు లేని కారణంగా ఈ చెక్కు బౌన్స్ అయింది. దీనిపై శేఖర్ రెడ్డి పలుమార్లు జీవితను సంప్రదించినా కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే లాయర్ సాయంతో శేఖర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.., బాధితుడికి అన్యాయం జరిగిందని.. జీవిత చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసినట్లు నిర్ధారించింది. నేరాభియోగం నిర్ధారణ కావటంతో ‘జీవిత’ రాజశేఖర్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. భర్త రాజశేఖర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ర్టీలో కొనసాగుతున్న జీవిత ఈ పరిణామంతో షాక్ కు గురయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు పట్ల కుటుంబ సభ్యులు, జీవిత సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తాజా జైలు శిక్షకు కారణం అయిన ‘ఎవడైతే నాకేంటి’ సినిమా 2007లో విడుదల అయింది. రాజకీయ మార్పు నేపథ్యంగా వచ్చిన ఈ మూవీకి మంచి స్పందనే వచ్చింది. ఇక రాజశేఖర్ నటిస్తున్న ‘గడ్డంగ్యాంగ్’ సినిమాకు కూడా జీవిత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం సిద్దమవుతోంది. ఈ మద్యే సినిమా పాటలు కూడా విడుదల అయ్యాయి. ఈ క్రమంలో రాజశేఖర్ ను వెంట ఉండి నడిపించే జీవితకు జైలు శిక్ష పడటంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeevitha Rajasekhar  jailed  erramanjil court  cheque bounce  latest news  tollywood  

Other Articles