Bandla ganesh trying to stop i movie release on sankranti

bandla ganesh on i movie, bandla ganesh angry on i movie, bandla ganesh stops i movie, gopala gopala release latest update, bandla ganesh comments, i movie release date, i movie photos, i movie telugu release date, vikram next movie updates, i movie photos trailers teasers updates, temper movie releae latest updates, koliwood latest news updates

bandla ganesh trying to stop i movie release on sankranti : big producer bandla ganesh trying to stop i movie telugu dubbing release for sankranti as per industry rules, bandla ganesh says as per industry dubbing movies should not release but i is breaking rule so it should stopped

ఆగిపోయే ‘ఐ’ విడుదలను అడ్డుకుంటున్నాడు

Posted: 11/26/2014 10:12 PM IST
Bandla ganesh trying to stop i movie release on sankranti

విక్రమ్ హీరోగా వస్తున్న తాజా వండర్ మూవీ ‘ఐ’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ‘దీపావళి’కి వస్తుంది అనుకున్న సినిమా క్రిస్టమస్ కు కూడా వచ్చేట్లు లేదు. చివరకు సంక్రాంతికైనా విడుదల చేద్దామని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా డౌటే అని అంటున్నా.., విల్ ట్రై అని పనిచేస్తున్నారు. కాని తెలుగులో సంక్రాంతికి ‘ఐ’ సినిమా వస్తే వివాదాలు తప్పవని తెలుస్తోంది. పండగకు ఈ మూవీ రాకుండా భారి బడ్జెట్ సినిమాల నిర్మాత బండ్ల గణేష్ అడ్డుపడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు పవన్ వెంకటేష్ కాంబినేషన్ ‘గోపాల గోపాల’, అనుష్క లేడీ ఓరియంటెడ్ ‘రుద్రమదేవి’ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా కూడా విడుదల అవుతుందని ప్రకటించారు. పండగకు వచ్చే సినిమాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ‘ఐ’ మూవీ కూడా సంక్రాంతికే వస్తుంది అని అంటున్నారు. నిర్మాతల మండలి నిబంధనల ప్రకారం ఇతర బాషల్లోని అనువాద సినిమాలు పండగల సమయంలో విడుదల చేయకూడదు. అయితే ఈ మూవీని మాత్రం విడుదల చేస్తామని అంటున్నారు.

తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో సభ్యుడుగా ఉన్నారు. ఈ కారణం వల్లే ఆయన నిబంధనలు పట్టించుకోకుండా ఎవరూ ఏమి చేయలేరు అన్నట్లుగా ‘ఐ’ విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు బండ్ల గణేష్ వర్గం ఆరోపిస్తోంది. నిబంధనలు ఎవరు అతిక్రమించినా సహించబోమని గణేష్ వర్గం వార్నింగ్ ఇస్తోంది. దీనిపై మిగతా నిర్మాతలతో కలిసి ఛాంబర్ లో పోరాటం చేస్తామని అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి వస్తే అటు ‘ఐ’ తో పాటు మిగతా సినిమాలు కూడా కలెక్షన్ల పరంగా నష్టం ఎదుర్కుంటాయి. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా మిగతా వాటితో పోటి పడితే కలెక్షన్లలో షేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా సినిమాలు కూడా కలెక్షన్ల పరంగా వాటా కోల్పోతాయి. ఈ నేపథ్యంలో ‘ఐ’ ముందే విడుదల అవుతుందా.., లేక ఫిబ్రవరిలో వచ్చి కలెక్షన్లను కొల్లగొడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandla ganesh  i movie  vikram  gopala gopala  temper  

Other Articles