Telugu movie release effected with tollywood workers strike

tollywood strike, tollywood workers strike, telugu film industry workers strike, why tollywood workers strike, telugu movie shootings, sankranti release movies telugu movies in 204, latest news updates movie shootings, 24 departments of film industry

shootings stopped with tollywood workers strike : tollywood workers on strike with demand to increase wages, 24 departments of film industry participates in strike with strike alls movies shootings stopped, tollywood strike creates fear to big directors and heros about their movie releases

టాలీవుడ్ లో షూటింగులు బంద్

Posted: 11/27/2014 08:53 AM IST
Telugu movie release effected with tollywood workers strike

వేతన సవరణను కోరుతూ టాలీవుడ్ కార్మికులు పిలుపునిచ్చిన నిరవధిక సమ్మె ప్రారంభంమైంది. ఉదయం నుంచి సమ్మె మొదలు కావటంతో కార్మికులంతా షూటింగులను బహిష్కరించారు. 24విభాగాలకు చెందిన 14వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా టాలీవుడ్ లో జరగాల్సిన అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. వేతన సవరణ డిమాండ్ ను పరిష్కరించే వరకు తమ సమ్మె ఆగదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. గ్యారంటీ లేని బ్రతుకులతో ఇండస్ర్టిని నమ్ముకున్న తమకు వేతనాలు పెంచమని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నా నిర్మాతల మండలి స్పందించటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 24 విభాగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కేవలం సమ్మె చేయటమే కాకుండా తమ ఆవేదన తెలియజేసేందుకు కళా ప్రదర్శనలు, వినూత్న నిరసనలకు సిద్దం అవుతున్నారు. వేతనాల పెంపుకు సంబంధించి సినీ ప్రముఖులతో పాటు, నిర్మాతల మండలిని సంప్రదించి.., 4నెలలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవటం వల్లే సమ్మె చేపట్టాల్సి వచ్చిందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. దీనివల్ల సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నా తప్పటం లేదని పేర్కొన్నారు. అందరూ తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

కార్మికుల సమ్మెతో టాలీవుడ్ ఇండస్ర్టీలో షూటింగులన్నీ నిలిచిపోయాయి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ, ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్ ‘టెంపర్’, ప్రభాస్ హీరోగా వస్తున్న ‘బాహుబలి’, పవన్-వెంకటేష్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీ‘గోపాల గోపాల’ సహా ఇతర సినిమాల షూటింగులన్నీ నిలిచిపోయాయి. దీంతో డిసెంబర్ తో పాటు సంక్రాంతికి సినిమాలు విడుదల చేద్దామని ప్లాన్ చేసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె ఎక్కువ కాలం కొనసాగితే సినిమాల విడుదలపై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. నిర్మాతల మండలి త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  workers  strike  shootings  

Other Articles