Ntr temper movie official logo poster

temper movie updates temper movie official logo poster, temper movie first look, ntr first look in temper movie, temper movie release date, temper movie ntr kajal photos, temper movie shooting photos trailers teasers, temper movie latest updates, ntr next movie updates, kajal next movie updates, tollywood latest movie updates

ntr temper movie official logo poster : all ntr fans in junior ntr latest movie temper movie fever and they are crazy about movie latest updates, here is a latest movie official logo poster released by movie unit, temper is going to release for sankranti 2015

‘టెంపర్’లేచింది.. సాయంత్రమే రిలీజ్

Posted: 11/27/2014 11:37 AM IST
Ntr temper movie official logo poster

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘టెంపర్’ ఫీవర్ తో ఊగిపోతున్న ఫ్యాన్స్ కు అఫిషియల్ స్టేట్ మెంట్. సినిమా అఫీషియల్ లోగో పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీనిపై యూనిట్ వర్గాల నుంచి అధికారిక సమాచారం లేకపోయినా.., సోషల్ మీడియాలో మాత్రం.., అఫీషియల్ లోగో అంటూ తెగ షేర్ అవుతోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి వచ్చిన లోగో చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. అయితే ఇది ఒరిజినల్ లోగో అని మూవీ యూనిట్ వర్గాలు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.

ఇక మరొక విషయం ఏమిటంటే.., ఈ సాయంత్రం (గురువారం) ‘టెంపర్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ పూరీ జగన్నాధ్ స్వయంగా తన ఫేస్ బుక్ పేజీలో గురువారం ఉదయం పోస్ట్ చేశారు. సాయంత్రం 4గంటలకు సినిమా పోస్టర్ విడుదల అవుతుంది.. ఎక్కడకు వెళ్ళకుండా వెయిట్ చేయండి అని పోస్ట్ పెట్టాడు. బుధవారం రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ లీక్ ఫొటోలు అంటూ.., వచ్చిన కొన్ని ఫొటోలు హల్ చల్ చేశాయి. ఇవి చూడటానికి లీక్ ఫొటోలే అయినా.., తారక్ స్టయిల్, బాడీ మాత్రం బాగా ఆకట్టుకుంది. లీక్ ఫొటోలే ఇలా ఉంటే.., ఒరిజినల్ ఇంకెలా ఉంటుందో అని తీవ్ర ఆసక్తి నెలకొంది.

జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.., వక్కంతం వంశీ కథను అందించాడు. 2015 సంక్రాంతి విడుదల టార్గెట్ గా పెట్టుకున్న సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే టాలీవుడ్ లో కార్మికుల సమ్మె కారణంగా గురువారం ఫిలిం సిటీలో ప్రారంభం కావాల్సిన షూటింగ్ షెడ్యూల్ నిలిచిపోయింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper  logo  ntr  puri jagannath  kajal  latest news  

Other Articles