Yamaleela2 movie preview and theaters latest updates

yamaleela 2 release date and theaters list, yamaleela 2 overseas america theaters list, yamaleela 2 karnataka bangalore tamilnadu theaters, yamaleela 2 movie review, yamaleela 2 movie cast and crew, yamaleela 2 latest photos and trailers songs, yamaleela 2 updates, yamaleela 2 review and rating, telugu latest comedy movies, tollywood latest news updates

yamaleela2 movie preview and theaters latest updates : sv krishnareddy story yamaleela2 ready to entertain tollywood fans from 28th november. mohan babu characterised yamaleela2 releases world wide more than 500 theaters and hopes good response will come to comedy story

సూపర్ కామెడిపై భారీ ఆశలున్నాయి

Posted: 11/27/2014 11:02 AM IST
Yamaleela2 movie preview and theaters latest updates

చాలా కాలం తర్వత సినిమా తీసిన ఎస్వీకృష్ణారెడ్డిపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. డైరెక్టర్ అభిమానులతో పాటు, కామెడి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. చాలాకాలగా ఫ్యామిలి కోరుకునే కామెడికి దూరమైన తెలుగు ప్రేక్షకులకు వరంగా వచ్చిన ‘యమలీల2’ మూవీ నవంబర్ 28న విడుదల అయ్యేందుకు సిద్ధం అయింది. ప్రపంచ వ్యాప్తంగా 500కి పైగా థియేటర్లలో మూవీ విడుదల అవుతోంది. కేవీ సతీష్ హీరోగా వస్తున్న తొలి సినిమాతోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసిన ఘనత పొందారు.

ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ హిట్ మూవీల్లో ఒకటైన ‘యమలీల’ను తీసుకుని దానికి సీక్వెల్ గా రూపొందించిన ‘యమలీల2’లో యముడి క్యారెక్టర్ లో మోహన్ బాబు నటించారు. హీరో సతీష్ కాగా.., హీరోయిన్ గా దియా నికోలస్ నటించింది. బ్రహ్మానందం తన పాత చిత్రగుప్తుడి క్యారెక్టర్ పోషించగా.. కొత్తగా కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని, షియాజి షిండే తదితరులు నటించారు. ఇలా పత కొత్త కలయికతో సినిమా రూపొందింది. అప్పట్లో సూపర్ హిట్ సినిమా కావటంతో పాటు, మళ్ళీ కృష్ణారెడ్డి డైరెక్షన్ కావటంతో సేమ్ హిస్టరీ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

శుక్రవారం రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన.., అందరూ ఆస్వాదించే కామెడి ఇవ్వాలని కోరుకుందాం. ఎస్వీ మార్కు కావటంతో ఫ్యామిలి అంతా కలిసి ఏ ఇబ్బంది లేకుండా చూడవచ్చు అనే భరోసా వచ్చేస్తుంది. క్లీన్ కామెడికి కేరాప్ అడ్రస్ గా ఉండే కృష్ణారెడ్డి ఈ సినిమాతో తనను తాను నిరూపించుకోవటంతో పాటు మళ్లి ఇండస్ర్టిలో సినిమాలు తీయటం మొదలు పెడతారని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yamaleela 2  release  sv krshna reddy  mohan babu  tollywood  

Other Articles