Junior ntr comments balakrishna song memu saitham tollywood programme hudhud cyclone victims

junior ntr, junior ntr latest news, junior ntr balakrishna, junior ntr balakrishna song, memu saitham programme, memu saitham programme videos, memu saitham stars, tollywood stars, balakrishna memu saitham songs, balakrishna singing, junior ntr cricket match, junior ntr memu saitham programme, junior ntr speech

junior ntr comments balakrishna song memu saitham tollywood programme hudhud cyclone victims

బాబాయ్ పాటపై అబ్బాయ్ కామెంట్

Posted: 12/01/2014 03:19 PM IST
Junior ntr comments balakrishna song memu saitham tollywood programme hudhud cyclone victims

‘హుధుద్’ బాధితుల సహాయంకోసం తెలుగుచిత్రపరిశ్రమ వినోదాత్మకమైన ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే! ఆదివారం (30-11-2014)నాడు ఏకధాటిగా 12 గంటలవరకు జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలతోబాటు కమెడియన్స్, సింగర్స్, ఇతర కళాకారులు, ప్రముఖులంతా సందడి చేశారు. ఇందులో భాగంగానే బాలయ్య పాడిన పాట హైలైట్’గా నిలిచింది. ఎంతో ఉత్తేజభరితంగా ఆయన పాట పాడడాన్ని చూసి సినీస్టార్స్’తోబాటు అభిమానులు సైతం కేకలు వేశారు. ఇక ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

స్టేజీపై బాబాయ్ బాలకృష్ణ పాట పాడటం చూశానని, చాలా బ్రహ్మాండంగా పాడారని కితాబు ఇచ్చాడు. నిజానికి ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే తారక్ వారినుంచి దూరంగా వుంటున్నాడని గతకొన్నిరోజులగా ప్రచారాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే! ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ తన బాబాయ్ పాడిన పాటపై కామెంట్ చేయడం హాట్ టాపిక్’గా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే.. ఇన్నాళ్లు మధ్య వున్న అవాంతరాలు సద్దుమణిగి వుంటాయని, ఇకనుంచి వారిమధ్య విభేదాలు వుండకపోవచ్చునని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సాయంత్రానికి షోకు హాజరైన ఎన్టీఆర్.. తుపాను బాధితుల కోసం టాలీవుడ్ నిర్వహించిన షోకు తాను హాజరుకావడం ఎంతో గర్వంగా వుందని అన్నాడు. నిజానికి తాను గతరెండురోజుల నుంచి అస్వస్థతగా వున్నానని, ఈ షోకు దూరంగా వుడాలని అనుకున్నానని పేర్కొన్న జూనియర్.. కానీ అందరూ తారలు చేసే ప్రయత్నాల్ని చూసి తనకు సిగ్గేసిందని, అందుకు ఈవెంట్’కు హాజరయ్యానని వివరణ ఇచ్చుకున్నాడు. అలాగే.. రామారావు, నాగేశ్వరరావుల ఆశీస్సులు ఇండస్ట్రీపూ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. తుఫాన్ బాధితులకు ఉడతా భక్తిగా తాము సాయం చేస్తున్నామని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles