Anjali replaced anushka bhagamati movie heroine role

anushka in bhagamati movie, bhagamati movie cast and crew, anushka not doing bhagamati movie, anushka next telugu movie update, anjali next movie updates, anjali movies, anjali latest hot photos, anjali in bhagamati movie, bhagamati movie latest updates, uv creations movies, tollywood latest news update

anjali replaced anushka bhagamati movie heroine role : tollywood top heroine anushka busy with her schedule and not willing to do all of her pre booked movies in this schedule. anushka replaced with anjali in bhagamati movie

హైదరాబాద్ స్టోరీ చేయదట.. ఏరికోరి ఎసరు పెట్టుకుంటోంది

Posted: 12/02/2014 08:32 AM IST
Anjali replaced anushka bhagamati movie heroine role

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క ఈ మద్య మరీ బిజీ అయిపోయింది. సినిమా చాన్సులు వరసగా వస్తుండటంతో అన్ని ఎలా చేయాలా అని తల పట్టుకుంటోందట. అందుకే కొన్ని సినిమాలు వదిలేసుకుంటేనే బెటర్ అని ఫీలవుతోంది. లేడి ఓరియంటెడ్ సినిమాలు అంటే డైరెక్టర్లకు ట్యూన్ అయ్యే స్వీటీ బ్యూటి.., బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని సినిమా చాన్సులు వదిలేసుకుంటోంది. ఇదే కొందరికి కొత్త ఆఫర్లు తెచ్చిపెడుతోంది. తాజాగా ‘భాగమతి’ సినిమా నుంచి ఈ భామ తప్పుకున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. అంతేకాదు.., అనుష్క పక్కకు తప్పుకుంటే ఆమె ప్లేస్ లో అంజలిని తీసుకొచ్చి పెట్టారని కూడా ఫిలింనగర్ లో టాక్ విన్పిస్తోంది.

‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ ‘భాగమతి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో నటించేందుకు గతేడాదే అనుష్క ఓకే చెప్పి డేట్లు కూడా ఇచ్చిందట. అయితే మిగతా సినిమాల ఆఫర్లు ఉండటంతో యోగా టీచర్ ఈ ప్రాజెక్టు చేయటం లేదని తెలుస్తోంది. అటు హైదరాబాద్ లోని ఒకప్పటి నిజాం నవాబుల కాలం నాటి భాగమతి చరిత్రను తీసుకుని తెరకెక్కిస్తున్న ‘భాగమతి’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయటం అంజలికి మంచి ఆఫర్ అనుకోవాలి. ఈ మూవీతో లేడి ఓరియంటెడ్ సినిమాలకు కాంపిటిటర్ తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఈ క్యారెక్టర్లు చేస్తున్న అనుష్కకే భవిష్యత్తులో ఎసరుపెట్టే ఛాన్స్ కూడా ఉంది.

‘భాగమతి’ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. గతంలో ‘మిర్చి’ ‘రన్ రాజా రన్’ వంటి హిట్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం గోపి చంద్ తో మూవీ చేస్తోంది. ఇక పీవీపీ బ్యానర్ లో త్వరలో తెరకెక్కే ఓ సినిమాలో అనుష్క నటిస్తోంది. డబుల్ రోల్ చేస్తున్న అందాల భామ.., ఓ క్యారెక్టర్ లో సన్నగా, మరో క్యారెక్టర్ లో లావుగా కన్పించనుంది. ఇందుకోసం ఏకంగా వంద కేజీల బరువు పెరిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని టాక్ వస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  bhagamati  anjali  uv creations  tollywood  

Other Articles