Kv satish sv krishna reddy second combination

yamaleela 2 review and rating, yamaleela 2 collections, yamaleela 2 latest updates, yamaleela 2 success meet, sv krishna reddy kv satish next movie, sv krishna reddy movies, telugu comedy movies, tollywood latest news updates

kv satish sv krishna reddy second combination : yamaleela2 movie producer kv satish and director sv krishna reddy says both combination will work in future, in a few days sv krishna reddy and kv satish will do another combination movie

నువ్వు పెడతానంటే నేనొద్దంటానా..?

Posted: 12/02/2014 01:34 PM IST
Kv satish sv krishna reddy second combination

ఇండస్ర్టీలో సినిమా సక్సెస్ అయిందా.., ఫెయిల్ అయిందా అనేది పక్కనబెట్టేసి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే యాంగిల్ నే అంతా ఫోకస్ చేస్తున్నారు. అంతగా ఆడని మూవీలను కూడా అద్బత కలెక్షన్లు అంటూ అదరగొడుతున్నారు. సక్సెస్ మీట్లు పెట్టి సినిమా గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. గత నెలలో విడుదల అయిన ‘యమలీల 2’ మూవీకి ఆశించిన స్పందన రాలేదు అన్న విషయం తెలిసిందే. అయితే మూవీ యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ పెట్టింది. అందరిలాగే సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, ‘యమలీల 2’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. తొలి సినిమా అయినా అగ్రనటులు మోహన్ బాబు, బ్రహ్మానందం పక్కన ఏ మాత్రం జంకకుండా సతీష్ చాలాబాగా నటించాడని మెచ్చుకున్నాడు. అటు మైకు అందుకున్న నిర్మాత, నటుడు కె.వి సతీష్., తన డాన్స్, నటన చాలా బాగున్నట్లు కామెంట్లు వస్తున్నాయన్నారు. ఇకపై కూడా ఇలాంటి సినిమాలే మళ్ళీ మళ్ళీ చేస్తానని చెప్పారు. అంతేకాదు త్వరలోనే కెవి -ఎస్వీ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది అని ఇద్దరూ ప్రకటించారు.

ప్రెస్ మీట్ లో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇలా చెప్పారా.. లేక సీరియస్ గా ఇద్దరూ కలిసి సినిమా తీస్తున్నారా అనేది ఇప్పుడే చెప్పలేము. అయితే ఒక యాంగిల్ ఫెయిల్ అయింది అని తెలిశాక కూడా మళ్ళీ అదే ట్రై చేస్తానన్న వీరి ధైర్యాన్ని ఏమనాలో. ఇక డబ్బులు పెట్టేవాడే ఉంటే మళ్ళీ మళ్ళి ఇలాంటి సినిమాలు చేసేందుకు ఎస్వీకి ఏముంటుంది ఇబ్బంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yamaleela 2  kv satish  sv krishna reddy  tollywood  

Other Articles