Balakrishna nagarjuna differences

nagarjuna balakrishna conflicts, nagarjuna balakrishna differences, nagarjuna balakrishna issues, nagarjuna in memu saitham, balakrishna in memu saitham, tollywood stars performane highlights in memu siatham, tollywood latest news updates, balakrishna younger daughter marriage

balakrishna nagarjuna differences : differences between nagarjuna and balakrishna still continued in memu saitham programme also, balakrishna and nagarjuna have igo problem in solving conflicts between them

సాయం చేసే చేతులు కలవలేదు.. విభేదాలకు అవే కారణాలా...?

Posted: 12/02/2014 04:39 PM IST
Balakrishna nagarjuna differences

తెలుగు సినిమా ఇండస్ర్టీలోని గ్రూపు వివాదాలు మరోసారి బయటపడ్డాయి. అగ్ర నటుల మద్య విభేదాలు ‘మేముసైతం’ సాక్షిగా మరోసారి బయటకువచ్చాయి. ఇండస్ర్టీని ఏలుతున్న ఒక వర్గానికి చెందిన ఇద్దరు అగ్ర నటులు బాలకృష్ణ, నాగార్జున మద్య విభేదాలు తాజాగా కూడా బయటకు వచ్చాయి. ‘మేముసైతం’ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. ఉత్సాహంగా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అయితే ఇద్దరు కనీసం పలకరించుకోలేదు. మొహాలు కూడా సరిగా చూసుకోలేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వివాదానికి కొన్నాళ్ళ క్రితం జరిగిన చిన్న విషయమే కారణంగా అంతా చెప్తున్నారు.

ఇద్దరి మద్య వివాదానికి కారణాలను పరిశీలిస్తే..,  గతేడాది అక్కినేని నాగేశ్వర రావు సిని రజితోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తెలుగు తారాలోకం అంతా తరలివచ్చింది. అయితే బాలకృష్ణకు ఆహ్వానం అందకపోవటతో.., నందమూరి ఫ్యామిలి నుంచి ఏ ఒక్కరూ కన్పించలేదు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ ఇంటికి వెళ్ళిన నాగార్జున పొరపాటుకు కారణాలు వివరించి మనసులో ఏమి పెట్టుకోవద్దని కోరాడు. అయినా సరే ఫలితం లేదని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వివాదంను మరికొందరు ఇంకోలా చెప్తున్నారు. గతంలో ఓ సారి బాలకృష్ణను తనకేదో ఫేవర్ చేసి పెట్టాలని నాగార్జున కోరగా.. అప్పటినుంచి కింగ్ ను బాలయ్య దూరం పెట్టాడని అంటున్నారు.

ఈ రెండు వివాదాలు ఇలా ఉండగా.., బాలకృష్ణ చిన్న కుమార్తె పెళ్లికి అక్కినేని ఫ్యామిలి నుంచి కూడా ఎవరూ హాజరుకాలేదు. అంతకుముందు బాలకృష్ణ తన విషయంలో వ్యవహరించిన తీరుకు ప్రతిగా నాగార్జున ఇలా చేసినట్లు అప్పటినుంచే అంతా అనుకుంటున్నారు. ఇలా వీరి మద్య విభేదాలు ఏర్పడి అవి అలాగే మిగిలిపోయాయి. తాజాగా తుఫాను బాధితులకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన ‘మేముసైతం’లో కూడా విభేదాలను పక్కనబెట్టేందుకు ఇద్దరు హీరోలు ప్రయత్నించలేదు. ఇండస్ర్టీలో ప్రస్తుత తరానికి ఉన్న నాలుగు మూల స్థంభాల్లో ఇద్దరు ఇలా ఎడమోహంగా ఉంటే.. రాబోయే తరాలు వీరి గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అవతలివారికి అవకాశం ఇవ్వకుండా వీలైనంత త్వరగా విభేదాలు తొలగించుకుంటే ఉత్తమం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna  balakrishna  memu saitham  tollywood  

Other Articles