హీరోయిన్లకు ఈ మద్య నోటిదూల కాస్త ఎక్కువవుతోంది. ఓ భామ బాహాటంగా సెక్స్, బ్రాల గురించి మాట్లాడుతుంటే.., మరో అమ్మడు అందానికి అర్థాలు చెప్తోంది. అయితే ఎవరికి వారు తమగురించి చెప్పుకుంటే పర్వాలేదు కానీ.., తమను పొగుడుకునేందుకు ఇతర హీరోయిన్లను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తాజాగా.., అందంపై కలువ కళ్ళ భామ శృతి హాసన్ స్పందించింది. హీరోయిన్లు అంటే మేకప్, లైటింగ్ వేస్తేనే అందంగా కన్పిస్తారు లేకపోతే వారిని చూడలేము అనే మాట వాస్తవమే అని అంగీకరించింది.
అయితే తన విషయంలో మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పకుంటోంది. ఎందుకంటే తనది నేచురల్ అందమట. ‘ఎలాంటి మేకప్ లేకపోయినా.., నేను అందంగా కన్పిస్తాను. అంతేకాకుండా నా శరీరాకృతి కూడా ఖచ్చితమైన సైజులతో ఉంటుంది.’ అని చెప్పింది (ఇంకా నయం కావాలంటే కొలిచి చూసుకోమనలేదు). దీనికి ఓ కారణం కూడా సెలవిచ్చింది. అదేమంటే., ‘నా తల్లితండ్రులు అందంగా ఉంటారు. కాబట్టి నేను కూడా అందంగా ఉన్నాను’ అని గొప్పలు చెప్పుకుంటోంది. అమ్మడి గ్లామర్ గురించి డౌటే లేదు అయితే తనది మాత్రమే ఒరిజినల్ అని మిగతావారు డూప్లికేట్ బ్యూటీలని చెప్పటం స్టార్ హీరోయిన్లకు కాస్త ఇబ్బందికర విషయమే.
ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో చేసిన ప్రతి సినిమా ఫ్లాపు అయి ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ శృతి భామ సుడి ఒక్కసారిగా తిరిగింది. పట్టిందల్లా బంగారం అయిందన్నట్లుగా చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. దీంతో నాడు వద్దన్నవారే ఇప్పుడు కాల్షీట్లు కావాలని తిరుగుతున్నారట. టాలీవుడ్ లో ఇప్పటికే ఫుల్ డిమాండ్ ఉండగా.., పట్టించుకోని పుట్టిళ్ళు కోలీవుడ్ లో కూడా క్రేజ్ పెంచుకుంటోంది. ‘పూజై’తో తమిళంలో ఖాతా తెరిచిన అమ్మడు ప్రస్తుతం విజయ్ తో ‘మారిశన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ డేట్ల వల్లే మహేష్ ప్రాజెక్టును పూణేలో మద్యలో వదిలేసి వెళ్ళిందన్న విషయం అందరికి తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ తో తెలుగులో ఒక ప్రాజెక్టు, విజయ్ తో ఒక తమిళంలో ఒక సినిమా చేస్తోంది. ఇది కాకుండా హిందీలో ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ సడన్ గా ఇలా అందం, బాడీ షేపుల గురించి ఎందుకు మాట్లాడిందంటే.., ఏదో ఒక విషయంపై కాస్త కాంట్రవర్సీ కామెంట్ చేయటం శృతికి అలవాటే. దాన్ని ఇప్పుడు కాస్త తగ్గించి తన గురించి పొగుడుకోవటం మొదలు పెట్టింది. అయితే మనసు ఊరికే ఉంటుందా పొగడటంలోనూ ఇతరులను టార్గెట్ చేస్తి ఇలా ఆనందపడుతోంది అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more