Varun tej mukunda movie audio release update

mukunda movie audio release, mukunda movie songs, mukunda movie audio songs teasers, mukunda trailer and teasers, mukunda varun tej latest photos, mukunda movie latest updates, varun tej on mukunda movie updates, mukunda movie cast and crew, mega family heros, tollywood latest movie news updates, 2014 telugu movies

varun tej mukunda movie audio release update : mega family hero varun tej debut mukunda getting ready for release in december last week songs are going to release on 3rd december evening. before songs release mukunda audio got hit talk

విడుదలకు ముందే ఇలా అయితే ఇంకేముంది

Posted: 12/03/2014 10:19 AM IST
Varun tej mukunda movie audio release update

మెగా బ్రదర్ నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక సినిమా పాటలు ఇవాళ సాయంత్రం విడుదల కానున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలి హీరోలు పాల్గొంటారని తెలుస్తోంది. అటు వరుణ్ సినిమా కోసం ఎదురచూస్తున్న ఫ్యాన్స్ ఆడియో రిలీజ్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మిక్కి జే మేయర్ స్వరపర్చిన పాటల టీజర్లు, ప్రోమోలు విడుదలై పాపులర్ అయ్యాయి.  మిక్కి మెలోడి ట్యన్లు, సిరివెన్నెల లిరిక్స్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. దీన్నిబట్టే ఆడియో ఆల్రెడి హిట్ అయినట్లు స్పష్టం అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ‘ముకుంద’ మూవీని నల్లమలుపు బుజ్జి, ఠాగోర్ మధు కలిసి నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా సాగే సినిమా కథ అని శ్రీకాంత్ చెప్పాడు. తొలి మూవీ వరుణ్ కు హిట్ ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukunda  audio release  varun tej  naga babu  mega family  tollywood  

Other Articles