Ntr puri jagannath temper movie not releases sankranti

temper movie release date, temper latest updates, temper movie shooting photos, temper movie songs release date, ntr photos in temper, puri jagannath next movie updates, sankranti 2015 movies, telugu movies in 2014

ntr puri jagannath temper movie not releases sankranti : due to the ongoing strike in Tollywood ntr's upcoming Temper directed by Puri Jagannadh is not going to make it for Pongal

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన టాలీవుడ్

Posted: 12/05/2014 08:31 AM IST
Ntr puri jagannath temper movie not releases sankranti

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టాలీవుడ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇండస్ర్టీ అంటే., అందులో పనిచేసే కార్మికులన్నమాట. వీరి దెబ్బకు ‘టెంపర్’ సినిమా ఏం చేయాలో అర్థంకాక ఆందోళన చెందుతోంది. ముందుగా అనుకున్నట్లు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఫిలింనగర్ లో ప్రచారంలో ఉన్న పుకార్ల ప్రకారం.., సినిమా షూటింగ్ దాదాపు పూర్తియినా.., ప్రధాన అంశాల్లో కొన్ని సన్నివేశాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతంట ాలీవుడ్ లో కార్మికుల సమ్మె జరుగుతుండటంతో షూటింగ్ లు నిలిచిపోయాయి.

ఫలితంగా సంక్రాంతికి సినిమా విడుదల కావటం డౌటే అని అంటున్నారు. అంతేకాకుండా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని పిబ్రవరి 5న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే.., దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాకపోవటంతో సంక్రాంతికి సినిమా విడుదలపై ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.., షూటింగ్ తో పాటే., పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. దీంతో మిగతా పార్ట్ ను వేగంగా షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తారని పూరీపై ఆశలు పెట్టుకున్నారు.

మరో విషయం ఏమిటంటే.., ‘టెంపర్’ విడుదల తేదీగా అనుకున్న జనవరి 9న శంకర్ క్రియేషన్ ‘ఐ’ సినిమా విడుదల అవుతుందట. దీంతో గట్టి పోటి ఖాయమని తెలుస్తోంది. అటు ‘గోపాల గోపాల’ కూడా సంక్రాంతి కోసం సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. తాజా అప్ డేట్స్ అన్ని పరిశీలిస్తే.., థియేటర్లు ఖాళీ లేని కారణంగా ‘రుద్రమదేవి’ సంక్రాంతికి రావటం లేదు. ఇప్పుడు ‘టెంపర్’ కూడా రేసు నుంచి తప్పుకున్నట్లు టాక్ వస్తోంది. దీనికి తోడు పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయవద్దని పరోక్షంగా ‘ఐ’ని కొందరు నిర్మాతలు అడ్డుకుంటున్నారు. అంటే పండగకు వచ్చేది పవర్ స్టార్ మాత్రమే అని స్పష్టం అవుతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : temper  ntr  puri jagannath  sankranti  

Other Articles