Anushka rudramadevi 3d movie post production creates release problems

anushka in rudramadevi movie, rudramadevi movie release date, rudramadevi movie work shootings, rudramadevi cast and crew, rudramadevi latest news upates, anushka photos in rudramadevi, guna shekar upcoming movie updates, allu arjun in rudramadevi movie, tollywood latest updates, 2015 sankranti release telugu movies, 3d works

anushka rudramadevi 3d movie post production release problems : rudramadevi 3D is proving to be a big challenge for the movie in terms of post production. complex nature of 3D effects and the huge special effects work rudramadevi movie facing release problems

అనుష్క కష్టాలు అన్నీ ఇన్నీ కావు

Posted: 12/05/2014 10:06 AM IST
Anushka rudramadevi 3d movie post production creates release problems

స్వీటీ అనుష్క నటించిన సినిమాలు ఈ మద్య ఏమి రాలేదు. ‘రుద్రమదేవి’తో అయినా అభిమానుల ఆకలి తీరుద్దామని భావిస్తే.., ఈ సినిమా అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. హిస్టారికల్ మూవీగా తెరకెక్కతున్న మొదటి నుంచి కష్టాలు పడుతోంది. అన్ని అడ్డంకులు దాటుకుంటూ విడుదలకు సిద్దమవుతుంటే ఇప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సినిమాకు అడ్డంకులు వస్తున్నాయి. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనుకుంటున్న గుణశేఖర్ కల ఫలించేలా కన్పించటం లేదు.

తాజా సమాచారం ప్రకారం.. ‘రుద్రమదేవి’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే 3డీ మూవీ కావటంతో.., ఇందుకోసం బాగా సమయం పడుతోంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ 3డీ ఎపెక్ట్ తో పాటు స్పెషల్ ఎపెక్ట్ ఇచ్చుకుంటూ పని జరుగుతుండటంతో చాలా సమయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సంక్రాంతికి సినిమా రావటం లేదు అని మూవీ యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గుణశేఖర్ ఈ సినిమా కోసం 9సంవత్సరాలు రీసెర్చ్ చేసి కథ సిద్ధం చేసుకున్నాడు. దేశంలోనే తొలి హిస్టారికల్ 3డి మూవీగా ‘రుద్రమదేవి’ నిలుస్తుంది.

స్టీరియో స్కోపిక్ ద్వారా సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎఫెక్ట్స్  విషయంలో రాజీ పడితే పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరగేదని అంటున్నారు. అయితే క్వాలిటీ కోరుకోవటంతో కాస్త సమయం తీసుకుంటోంది. అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో నటింవచిన ఈ సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి అనే గెస్ట్ రోల్ చేశాడు. నిత్యమీనన్, కేథరిన్, హంసానందిని, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్ సహా ఇతర ముఖ్య నటులు ‘రుద్రమదేవి’లో నటించారు. ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీని కల్పించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rudramadevi  anushka  3d works  guna shekar  tollywood  

Other Articles