Nampally court clean chit shweta basu prasad prostitution case

nampally court on shweta basu, shweta basu prostitution case update, shweta basu family members on prostitution case, tollywood stars in prostition cases, tollywood heroines artists sex racket cases, tollywood latest news updates, shweta basu movie offers

nampally court clean chit shweta basu prasad prostitution case : finally nampally court gives clean chit to shweta basu prasad in prostitution case. with nampally court judgement shweta basu family feels happy

అగ్ని పరీక్ష నెగ్గిన టాలీవుడ్ శ్వే(సీ)త.. కోర్టు క్లీన్ చిట్

Posted: 12/06/2014 03:54 PM IST
Nampally court clean chit shweta basu prasad prostitution case

సమాజమంతా ఏకమై..., నిందలు వేసి అవమానస్తున్నా నిగ్రహంగా వేచి చూసిన శ్వేతకు న్యాయం లభించింది. తాను ముందునుంచి చెప్తున్నట్లుగా ఏ తప్పు చేయలేదని కోర్టు నిర్ధారించింది. ఆమెపై వచ్చిన వ్యభిచార ఆరోపణలు కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందలు పడ్డ నటికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నెలల పాటు అనుభవించిన మనోవేదన నుంచి శ్వేత, ఆమె కుటుంబం బయటపడింది. కోర్టు తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వాస్తవాలు తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాదనల సందర్బంగా తన అరెస్టు సమయంలో జరిగిన విషయాలను కోర్టులో శ్వేత వివరించింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా బుక్ చేసిన హోటల్ కు తాను వెళ్ళినట్లు చెప్పింది. హోటల్ గదిలో ఉండగా వచ్చిన పోలిసులు, వ్యభిచారం కేసులో అరెస్టు చేస్తున్నామంటూ స్టేషన్ కు తీసుకెళ్ళారని వెల్లడించింది. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని.., వ్యభిచారం చేస్తున్నట్లు ఆధారాలు లేవని విన్నవించింది. ఈ వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు శ్వేతపై వచ్చిన అభియోగాలు అవాస్తవంగా తేల్చింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు తీర్పు పట్ల శ్వేత బసు ప్రసాద్ సంతోషం వ్యక్తం చేసింది. తాను నిర్దోషి అని నిరూపించుకునేందుకే ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ముఖాల్లో సంతోషం కన్పిస్తోందని పేర్కొంది. శ్వేత అరెస్టుపై మొదటినుంచి చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వ్యభిచారం కేసులో అరెస్టయితే ఆమెతో పాటు దొరికిన వ్యక్తిని కూడా కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా జరగకపోవటంతో పోలిసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు కోర్టు నిర్ధోషి అని తీర్పు ఇవ్వటంతో అగ్ని పరీక్ష నెగ్గిన సీతలా శ్వేత బయటకు వచ్చిందని అభిమానులు అంటున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles