Shankars i movie release dates declared

shankars i movie release dates, shankars i movie release dates, i movie release dates, i movie release dates declared, vikram i movie release dates declared, vikram in I movie, vikram latest updates, vikram movie news, vikram photos, vikram comments, vikram gossips, shanker latest movies, shanker latest updates, amy jackson latest updates, amy jackson latest movies

shankars i movie release dates declared

శంకర్ ఐ చిత్రం విడుదల తేదీ ఖరారు

Posted: 12/16/2014 09:19 AM IST
Shankars i movie release dates declared

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో.. కాలీవుడ్ అగ్రనటుడు విక్రమ్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ భారీ చిత్రం 'ఐ' . కాలీవుడ్ జక్కనగా పేరొందిన శంకర్ చిత్రం అనగానే ఆత్యాధునిక శస్త్ర సాంకేతికతతో పాటు ఒక చక్కటి మెసేజ్ ఓరియేంటెండ్ చిత్రం అని అభిమానులకు తెలుసు. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదల చేయనున్నట్లు సమాచారం. గత కోంత కాలంగా వాయిదాలపై వాయిదాలు వేసుకుంటూ వస్తున్న ఈ చిత్రం వచ్చేనెల జనవరి 9న విడుదల కానుంది.

అయితే సంక్రాంతికి శంకర్ ఐ చిత్రం విడుదల కావడం లేదంటూ వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం. ఇప్పటికే మృగరాజు వేషంలో ఉన్న ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచుతోంది. 'ఐ'లో విక్రమ్‌ సరసన అమీ జాక్సన్‌ నటించింది. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకుడు. ప్రచార చిత్రంలో విక్రమ్‌ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు. విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shankar  'I'  release  Sankranthi  Vikram  Amy Jackson  

Other Articles