Ahuti prasad hospitalised

cine artist ahuti prasad hospitalised, ahuti prasad hospitalised, ahuti prasad hospitalised due to ill health, ahuti prasad undergone medical tests, ahuti prasad in kims Hodpital, ahuti prasad in kims

cine artist ahuti prasad hospitalised due to ill health

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆహుత ప్రసాద్

Posted: 12/16/2014 09:53 AM IST
Ahuti prasad hospitalised

ప్రముఖ సినీ నటుడు అహుతి ప్రసాద్ అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం రాత్రి ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆహుతి ప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన, అరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలను నిర్వహించుకున్నారు. ఆయన్ని బంధువులు, స్నేహితులు పరామర్శించారు.
 
ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్‌. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. అంచెలంచెలుగా పైకి వచ్చిన నటులలో ప్రసాద్ ఒక్కరు. అహుతి సినిమా నుంచి తెలుగు చిత్రసీమకు పరిచయమైన ప్రసాద్.. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం  సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ahuti prasad  kims  secunderabad  Tollywood News  

Other Articles