Ram charan tej srinu vatila movie title confirmed

ram charan tej srinu vaitla movie name, ram charan tej srinu vaitla new movie, ram charan tej new movie updates, srinu vaitla movie updates, tollywood latest news updates, telugu movies 2014

ram charan tej srinu vatila movie title confirmed : tollywood mega power star ram charan tej latest movie with srinu vaitla is ready to go on to sets, filmnagar people saying that ram charan srinu vaitla movie title may taken from mega star popular movie

ఈ పేరైతే బాగుంది కానీ..,

Posted: 12/16/2014 12:16 PM IST
Ram charan tej srinu vatila movie title confirmed

శ్రీనువైట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు త్వరలోనే షూటింగ్ సెట్ లోకి వెళ్లనుంది. కథకు తుది మెరుగులు దిద్దే పనిలో వైట్ల బిజీగా ఉన్నాడు. ఫిలింనగర్ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం.., ఈ సినిమాకు ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ఓ పాటలో ఈ టైటిల్ ప్రస్తావన ఉంటుంది. దానిలోనుంచి చరణ్ మూవీకి పేరు పెట్టినట్లు తెలుస్తోంది. టైటిల్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాని ఇప్పటికే టైటిల్ బాగుందని కామెంట్లు వస్తున్నాయి.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే.., బెంగళూరు బ్యూటీ ప్రణితను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రెండవ హీరోయిన్ గా పూజా హెడ్గే లేదా రెజీనాను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కష్టపడి సినిమా ఆఫర్ ఒప్పించుకున్న శ్రీనువైట్ల తన టాలెంట్ అంతా ఉపయోగించి స్ర్కిప్టు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆగడు’ ఫెయిల్యూర్ నేపథ్యంలో తనను ప్రూవ్ చేసుకోవటంతో పాటు అందరికి సమాధానం చెప్పేలా సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అటు రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’కు మంచి స్పందన వచ్చినా.., కమర్షియల్ గా హిట్ కాలేదు. దీంతో ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej movie name  srinu vatila movies  tollywood latest updates  

Other Articles