సినిమాలు తీయటంలోనే కాదు.., ట్రైలర్లు, టీజర్లు, ఫొటోల విడుదలలో కూడా రాజమౌళిది ఓ ప్రత్యేకత. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పిరియాడికల్ ప్రాజెక్టు ‘బాహుబలి’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ముంబై కామిక్ కాన్ ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ వీడియోలో సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూపించారు. ఫొటోలు, ప్లాన్లు, షూటింగ్ కోసం చేసిన గ్రౌండ్ వర్క్, భారీ సెట్టింగుల రూపకల్పన, కళాకారులు కష్టపడ్డ విధానం అన్నీ వీడియోలో చూపించారు. ఈ వీడియోకు కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
సినిమా షూటింగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు కావటంతో.., ప్రేక్షకులు మూవీని మర్చిపోకుండా అప్పుడప్పుడూ ఇలా మేకింగ్ వీడియోలు, తారల ఫొటోలు, వీడియోలతో పలకరిస్తున్నారు. ఇది రాజమౌళి మార్కు మార్కెట్ స్టంట్ అయినా ఫ్యాన్స్ కు మాత్రం వీడియోలు, ఫొటోలు వచ్చినప్పుడు పండగే. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.., రానా ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అనుష్క, తమన్నా ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్కా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. తమన్నా పుట్టినరోజు సందర్బంగా ఆదివారమే మూవీ యూనిట్ సినిమాలో ఆమె ఫొటోను విడుదల చేసింది.
అత్యధిక కాలం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘బాహుబలి’ షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. పలు ఫైట్ సీన్లతో పాటు.., కీలక సన్నివేశాలు ఇక్కడ షూట్ చేస్తున్నారు. అటు ఇదే సమయంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇందుకోసం ప్రపంచస్థాయి నిపుణులు ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more