Mahesh babu koratala shiva srimanthudu movie south africa shooting

mahesh babu srimanthudu movie latest, mahesh babu south africa tour updates, mahesh babu koratala shiva movie, mahesh babu latest news update, mahesh babu sruti hassan movie updates, sruti hassan upcoming movie updates, tollywood latest news updates

mahesh babu koratala shiva srimanthudu movie south africa shooting : tollywood prince mahesh babu currently acting for koratala shiva movie shooting in progress movie unit plans to shoot some of scenes in south africa

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ

Posted: 12/22/2014 11:27 AM IST
Mahesh babu koratala shiva srimanthudu movie south africa shooting

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.., ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ మద్య హీరోయిన్ మారిందనీ.., ఏకంగా సినిమానే ఆగిపోయిందని రూమర్లు వచ్చినా అవన్నీ అబద్దమంటూ షూటింగ్ కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., త్వరలోనే మూవీ యూనిట్ దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. సినిమాలో కొన్ని సీన్లను అక్కడ షూట్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫారిన్ టూర్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు.., హీరోయిన్ శృతి హాసన్ కూడా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఆఫ్రికాలో పాటలతో పాటు, కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపింది.

ఓ వైపు మహేష్ భార్య నమ్రత న్యూ ఇయర్ వేడుకల కోసం సిద్దమవుతోంది. అబుదాబిలో వేడుకలు జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంటే ఫ్యామిలీతో కలిసి రెండ్రోజుల ముందుగా దుబాయ్ కు వెళ్తున్న సూపర్ స్టార్ వేడుకలు ముగించుకుని హైదరాబాద్ రాగానే మళ్ళీ సినిమా షూటింగ్ కోసం ఆఫ్రికా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. శృతి కారణంగా పూణే షూటింగ్ మద్యలో ఆగిపోయిన నేపథ్యంలో ఈ దఫా అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ‘ఆగడు’ ఫ్లాప్ తర్వాత నటిస్తున్న ఈ మూవీ కోసం మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డైలాగులు, సీన్లు, స్టోరి, బడ్జెట్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. భారీ అంచనాలు క్రియేట్ చేయవద్దనే ఉద్దేశ్యంతోనే సినిమా గురించి మీడియాకు ఎక్కువగా వివరాలు అందించటం లేదు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu movie  srimanthudu updates  koratala shiva  

Other Articles