Vijay latest movie title controversy

vijay latest movie title, garuda for vijay movie title, vijay latest movie cast and crew, vijay garuda movie updates, koliwood latest updates, sridevi latest movie updates, sridevi hansika vijay movies, vijay movie problem

vijay latest movie title controversy : hero vijay facing problem with his latest movie title garuda, vijay latest movie casts by sridevi hansika and other popular stars flick name become controversy that already some one registers title

సినిమా తీయకముందే లొల్లి షురూ

Posted: 12/22/2014 12:45 PM IST
Vijay latest movie title controversy

విజయ్ కు ఈ మద్య బ్యాడ్ టైమ్ కొనసాగుతోంది. ఆయన నటిస్తున్న సినిమాలు వివాదాలమయం అవుతున్నాయి. గత సినిమా ‘కత్తి’ విడుదలయ్యే చివరి నిమిషం వరకు ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. తమిళ సంఘాలను ఒప్పంచి వారి డిమాండ్లకు తలొగ్గితే సినిమా విడుదల అయింది. తాజాగా తీస్తున్న సినిమాపై కూడా వివాదం మొదలయింది. ఈ సినిమా టైటిల్ విషయంలో ప్రస్తుతం గొడవ జరుగుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్టుకు ‘మారిషన్’ అనే టైటిల్ పరిశీలించారు. ఆ తర్వాత ‘గరుడ’ అనే టైటిల్ పెడుతున్నట్లు మూవీ యూనిట్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో వివాదం మొదలయింది. అప్పటికే ఈ సినిమా టైటిల్ ను మరొక సంస్థ రిజిస్ట్ చేయించటంతో.., వివాదం ఏర్పడింది. దీంతో వెనక్కి తగ్గిన మూవీ యూనిట్ ‘గరుడ’ అనే టైటిల్ వదిలేసి ‘మరుధీరన్’ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మద్య టైటిల్స్ వివాదం సర్వసాధారణం అయిపోయింది. సినిమాకు ఒక టైటిల్ అనుకుంటే.., అది అప్పటికే రిజిస్టర్ అయి ఉంటోంది. దీంతో మరో టైటిల్ కోసం ఆలోచించాల్సి వస్తోంది. తెలియకుండా టైటిల్ పెట్టేస్తే కోర్టు కేసులు, ఇతర ఇబ్బందులు వస్తున్నాయి. బాలకృష్ణ తాజా చిత్రంకు కూడా ‘లయన్’ అనే టైటిల్ పై తెలంగాణ ఫిలిం ఛాంబర్ తో వివాదం ఏర్పడింది. దీంతో వెనక్కి తగ్గిన సత్యదేవ, ఈ మూవీకి వారియర్ అనే టైటిల్ పెట్టారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : vijay movie controversy  sridevi latest  koliwood updates  

Other Articles