Temper movie trailer release date

temper movie, temper movie trailer, temper first look, temper movie first look photo, temper latest photos, jr ntr temper movie, temper movie audio release date, temper movie audio songs, temper movie updates, temper movie latest, temper cast and crew, ntr movies, jr ntr movies, puri jagannath movies, puri jagannath latest, puri jagannath updates

temper trailer release date : ntr latest temper movie last schedule shooting started on 27th december. tollywood gossips that temper trailer will release for sankranti but no audio launch. temper audio will aired into market directly

పండగకు చిరుకానుక... ఫ్యాన్స్ కోరిక తీర్చని తారక్

Posted: 12/27/2014 04:06 PM IST
Temper movie trailer release date

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా.., ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీ విడుదల వాయిదా పడేందుకు అనేక కారణాలున్నాయి. చివరి వరకు వచ్చిన షూటింగ్ ఆగిపోవటం, పోటిలో ఉన్న సినిమాల వల్ల థియేటర్లు లేకపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా అనేక ఇబ్బందులతో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. శనివారం రోజు నుంచి చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు. హీరో ఎన్టీఆర్ సహా మిగతా పాత్రధారులూ షూటింగ్ లో పాల్గొన్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తామని మూవీ యూనిట్ చెప్తోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ‘టెంపర్’ ట్రైలర్ ను సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్ విన్పిస్తోంది. అయితే దీనిపై మూవీయూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.., ‘టెంపర్’ మూవీ ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించటం లేదు. ఎలాంటి కార్యక్రమం లేకుండా పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తారట. దీనికి కూడా తేదిని ప్రకటించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉన్నందునే కార్యక్రమాలు నిర్వహించటం లేదని బండ్ల సన్నిహితులు చెప్తున్నా.., అసలు కారణం మాత్రం ఆర్ధిక సమస్యలే అని తెలుస్తోంది.

గతంలో కూడా ఆర్ధిక సమస్యల వల్లే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆర్ధిక ఇబ్బందుల వల్లే హీరో, డైరెక్టర్, కథా రచయితకు రెమ్యునరేషన్ కు బదులుగా ప్రాంతాల వారీ హక్కులను బండ్ల గణేష్ రాసిచ్చాడని టాక్ విన్పిస్తుంది. షూటింగ్ సమయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ పిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ దఫా అయినా ‘టెంపర్’ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper trailer  jr ntr latest  puri jagannath updates  

Other Articles