Varun tej latest interview

varun tej interview, varun tej latest interview, varun tej movie updates, varun tej mukunda movie latest, varun tej upcoming movie, varun tej on srikanth addala, varun tej second movie, varun tej puri jagannath movie, varun tej latest updates, tollywood latest, tollywood updates

varun tej latest interview : mega prince says his experience about first film mukuna. varun tej reveals that he requests srikanth addala to keep some scenes in movie but director refused to put that scenes in the flick.

బ్రతిమాలినా శ్రీకాంత్ విన్పించుకోలేదు.. నాలో ఆ టాలెంట్ తొక్కేశాడు - వరుణ్ తేజ్

Posted: 12/27/2014 01:00 PM IST
Varun tej latest interview

సినిమా విడుదలకు ముందు.., విడుదల తర్వాత హీరోలు, డైరెక్టర్లు మూవీయూనిట్ సభ్యులు ఇంటర్య్వూలు ఇవ్వటం అలవాటే. ప్రి రిలీజ్ ప్రమోషన్, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ గా చెప్పుకునే ఈ ఇంటర్య్వూల వల్ల చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. సినిమా కోసం కళాకారులు పడిన కష్టం, తపన, ఖర్చు ఇతర కష్ట సుఖాలన్నీ ఈ సమయంలోనే బయటపడతాయి. అయితే ఇంటర్య్వూలు ఇచ్చేటపుడు డైరెక్టర్ ను మెచ్చుకుంటూనో లేక.., పని రాక్షసుడు అని తిట్టుకుంటూ పొగిడేలా హీరోలు మాట్లాడతారు. వరుణ్ తేజ్ మాత్రం ఇందుకు టోటల్ డిఫరెంట్ గా డైరెక్టర్ టాలెంట్ ను తొక్కేశాడు అంటూ కామెంట్ చేస్తున్నాడు.

తొలి సినిమా ‘ముకుంద’పై వరుణ్ తేజ్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శ్రీకాంత్ చెప్పిన స్టోరీ నాన్న నాగబాబుతో పాటు, పెదనాన్న చిరంజీవికి నచ్చటంతో వెంటనే ఓకే చెప్పేశారన్నారు. డైరెక్టర్ పై పూర్తి నమ్మకం ఉంచి ఆయన ఎలా చెప్తే అలా చేయమని వరుణ్ కు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారట. బాడి లాంగ్వేజ్, స్టోరీని బేస్ చేసుకుని కామెడి సీన్లు అయితే బాగుంటాయని వరుణ్ కు స్నేహితులు చెప్పారట. అంతేకాకుండా నిజజీవితంలోనూ టైమింగ్ గా వరుణ్ చేసే కామెడి, పంచ్ డైలాగులు బాగా పేలతాయి కాబట్టి... వాటినే సింపుల్ గా సినిమాలో పెట్టేయవచ్చు అని వారు సూచించటంతో ఇదే విషయాన్ని డైరెక్టర్ కు చెప్పాడట.

అయితే మెగా ప్రిన్స్ సూచనలను శ్రీకాంత్ పక్కనబెట్టేసి.., ‘సినిమాలో నీ క్యారెక్టర్ పూర్తిగా సీరియస్ గా ఉంటుంది. కామెడి ప్రయోగం వద్దు’అని చెప్పేశాడట. దీంతో తనలో ఉన్న కామెడి టాలెంట్ బయటకు రాలేకపోయింది. కథ, డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతో శ్రీకాంత్ చెప్పినట్లు విన్నాను అంటూ వెల్లడించాడు. సినిమాలో ఉన్న డైలాగులు, మంచి అర్ధం వచ్చే మాటలు బాగానే ఉన్నా.., కామెడి కూడా ఉంటే తాను ఇంకా సంతోషించేవాడిని అని చెప్తున్నాడు. ఈనెల 24న విడుదల అయిన ‘ముకుంద’ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

తొలి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.., మెగా ప్రిన్స్ కు ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. త్వరలోనే రెండవ సినిమా మొదలు పెట్టేందుకు వరుణ్ సిద్దమవుతున్నాడు. దీనికి మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మూడవ సినిమా క్రిష్ కు కాల్షీట్లు ఫిక్స్ అయ్యాయి. దీంతో మరో ఆర్నెళ్ల వరకు వరుణ్ డేట్లు ఖాళీగా ఉండవని తెలుస్తోది. ఈ రెండు సినిమాలు వేసవిలో ఒకటి.., వేసవి తర్వాత మరొకటి విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej  srikanth addala movies  tollywood latest  

Other Articles