Pawan kalyan twitter account fallowers record

pawan kalyan, pawan kalyan twitter account, pawan kalyan twitter account name, pawan kalyan facebook account, pawan kalyan photos, pawan kalyan latest photos, pawan kalyan wallpapers, gopala gopala latest song, gopala gopala movie release, gopala gopala updates, tollywood updates, upcoming movies

Pawan Kalyan twitter account : Pawan Kalyan opened twitter account on new year with huge response. power star become icon of twitter with huge fallowers in a short time. pawan kalyan twitter account fallowers increasing minute to minute

ట్విట్టర్ లోనూ పవన్ ట్రెండ్ సెట్టరే

Posted: 01/02/2015 09:08 AM IST
Pawan kalyan twitter account fallowers record

పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ట్రెండ్ సెట్టరే. సినిమా హీరోగా పవర్ స్టార్ సాధించుకున్న ఫ్యాన్ క్రేజ్ అంతా ఇంతా కాదు. కాని పవన్ కు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. అందుకే, అందరూ వాడుతున్నా.., సోషల్ మీడియాలో ఎక్కడా కన్పించరు. అయితేనేం ఆయన పేరుతో ఫ్యాన్స్ నడుపుతున్న పేజీలకు లక్షల లైకులు ఉన్నాయి. ఇదంతా ఒక రికార్డు అయితే పవన్ న్యూ ఇయర్ రోజున ట్విట్టర్ లో చేరి లేటెస్ట్ రికార్డు సృష్టించాడు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటలోపు ఎనమిది వేల మంది ఫాలోవర్లు వచ్చారు.

ఈ సంఖ్య ఇక్కడితో ఆగలేదు.., అలా కొనసాగుతూనే ఉంది. ప్రతి నిమిషానికి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్విట్టర్ కూడా అకౌంట్ ను వెరిఫై చేసి అఫీషియల్ గా ప్రకటించటంతో.., ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు ట్విట్టర్ లో అమితాబ్, సచిన్ ఇతరులు పేమస్ పర్సన్లుగా ఉండగా.., వారి రికార్డులను పవన్ త్వరలోనే బ్రేక్ చేస్తాడనిపిస్తోంది. సినిమాలు, ప్రజా సేవా కార్యక్రమాలతో మీడియాలో నిలిచే పవన్ స్వయంగా సోషల్ మీడియాకు రావటం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ విషయానికి వస్తే ‘గోపాల గోపాల’ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన మోషన్ పోస్టర్ తో పాటు, లేటెస్ట్ సాంగ్ కూడా సూపర్ గా ఉండటంతో.., సినిమా ఆడియో పరంగా హిట్ అవుతుందని టాక్ వచ్చేసింది. ఇక పవన్ నటించాడు కాబట్టి, విక్టరీని రాసిపెట్టుకోవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Pawan Kalyan  gopala gopala  twitter account  

Other Articles