Temper movie audio release date

Temper movie, temper movie audio release, temper movie audio release date, temper movie latest teaser, temper movie updates, temper movie latest news, temper movie latest photos, temper movie wallpapers, temper movie release date, tollywood updates, upcoming telugu movies

Temper movie audio release date : Temper movie audio release date announced to held on 18th january. NTR temper movie latest teaser got good response and brings high expectations. temper cast and crew working hard to complete movie shooting in time.

పోలిస్ తమ్మడి పాటలు ఎప్పుడొస్తాయంటే..!

Posted: 01/02/2015 10:18 AM IST
Temper movie audio release date

నందమూరి హీరోలంతా సడన్ గా పోలిస్ ఆఫీసర్లుగా మారిపోయారు. చిన్నబ్బాయ్ ఎన్టీఆర్ దయా గా కన్పిస్తుంటే.., అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా పోలిస్ ఆఫీసర్ గా కన్పిస్తున్నాడు. ఇక బాబాయ్ అయితే ఏకంగా సీబీఐ ఆఫీసర్ గా తాట తీసేందుకు సిద్దమవుతున్నాడు. మగ్గురు మొనగాళ్లలో మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. అన్నయ్య సినిమాతో పాటే ఈ తమ్మడి మూవీ కూడా వాయిదా పడింది. గతేడాది ఆగిపోయిన వీరిద్దరూ ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నారు.

సినిమా విడుదల తేదీ ప్రకటించకున్నా..., గురువారం మాత్రం ‘పటాస్’ ఆడియో రిలీజ్ జరిగింది. దీనికి ఎన్టీఆర్ కూడా వచ్చాడు.., అన్నయ్యకు విశెస్ చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. కళ్యాణ్ ఆడియో రావటంతో తారక్ మూవీ పాటలను కూడా విడుదల చేసేందుకు ‘టెంపర్’ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈనెల 18న పాటలు విడుదల చేస్తారని తెలుస్తోంది. శిల్పకళావేదిక లేదా... మరో చోట నిర్వహిస్తారని టాక్ విన్పిస్తోంది. డైరెక్ట్ మార్కెట్ అనుకున్న ఆడియో, వేడుకలా జరిపేందుకు ప్లాన్ చేయటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘టెంపర్’ మూవీ పిబ్రవరి 5న విడుదల కానుంది. గతంలో షూటింగ్ పూర్తి కాక ఇబ్బందులు పడ్డ ఈ సినిమా ఈ సారి అలా కాకుండా జాగ్రత్తపడుతోంది. పది రోజుల చివరి షెడ్యూల్ లో సగభాగం ఇప్పటికే పూర్తయింది. ఇంకా కొద్ది రోజులే షూటింగ్ ఉండటంతో వచ్చే వారంలో ఇది కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు కూడా జరుగుతుండటంతో.., ప్రొడక్షన్ ముగిశాక చివరి దశ పనులు పూర్తి చేసుకోనుంది. పూరీ డైరెక్షన్, వక్కంతం వంశీ కథపై తారక్ పెట్టుకున్న నమ్మకం హిట్ ఇస్తుందా లేదా తెలియాంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper movie  NTR  Temper audio release date  

Other Articles