Temper audio function release date controversies financial problems producer bandla ganesh

temper movie news, temper movie audio, temper movie songs, temper movie schedules, kajal agarwal news, kajal agarwal hot photos, kajal agarwal hot photo shoot, kajal agarwal romantic scens, kajal agarwal hot videos, junior ntr news, junior ntr temper movie news, director puri jagannath news, jr ntr puri jagannath movie, parameshwara art productions, producer bandla ganesh news

temper audio function release date controversies financial problems producer bandla ganesh : According to the tollywood sources.. temper movie audio may release on january 31.

వినసొంపైన ‘టెంపర్’ పాటలు 31న వినబడుతాయా?

Posted: 01/22/2015 12:06 PM IST
Temper audio function release date controversies financial problems producer bandla ganesh

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘టెంపర్’ మూవీ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్’గా తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్’లుక్ ఫోటోలు విడుదలై, ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడ్యూసర్ బండ్లగణేష్ నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్’గా కనువిందు చేయనున్నాడని తెలిసిందే!

ఇదిలావుండగా.. ఈ చిత్రానికి సంబంధించి పనులన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ ఆడియో విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈ మూవీ పాటలను జనవరి నెలలో పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి గానీ అలా జరగలేదు. తర్వాత జనవరి 18, 24 తేదీల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రచారాలు సాగాయి. అవి కూడా ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. అయితే తాజాగా ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఆడియోను జనవరి 31వ తేదీన విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మరి.. ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియరాలేదు. ఈ వార్త కూడా పుకారేనా..? లేక ఖచ్చితంగానే రిలీజ్ చేస్తారనే విషయం అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.

అయితే.. వరుసగా టెంపర్ ఆడియోపై వస్తున్న పుకార్లను చూస్తుంటే.. మూవీని ఫ్రీగా పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా రూమర్లు క్రియేట్ చేస్తున్నారని విశ్లేషకులు తెలుపుతున్నారు. అందుకే.. యూనిట్ వర్గాలతో ఒక్కొక్కరోజు ఒక్కొక్క వార్తను లీక్ చేయిస్తూ మూవీని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. మరోవైపు.. కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆడియో విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేకపోతున్నారని, తక్కువ ఖర్చుతో ఈ వేడుకను ముగించేయాలన్న ఉద్దేశంలో నిర్మాత వున్నట్లు వార్తలొస్తున్నాయి. అనుకున్నదానికంటూ మూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో ఆర్థికంగా నిర్మాతగా దెబ్బతిన్నాడని, అందుకే ఆడియోను గ్రాండ్’గా కాకుండా సింపుల్’గా ముగించేందుకు చిన్న లొకేషన్లు వెదుకుతున్నట్లుగా యూనిట్ వర్గాలు నుంచి సమాచారాలు వస్తున్నాయి. ఏదైతేనేం.. ఈసారి అనుకున్న తేదీకి టెంపర్ పాటలు వినిపిస్తాయో లేదో చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles