Director shankar tamil star ajith comibination movie kollywood news

shankar news, director shankar news, hero ajith news, shankar ajith news, shankar ajith movie news, shankar i movie news, i movie news, i movie collections, i movie photos, i movie latest news, hero ajith latest news, hero ajith gossips

director shankar tamil star ajith comibination movie kollywood news : director shankar and tamil star hero ajith to make a movie soon. Already script work is going on.

దర్శక దిగ్గజంతో ‘తలా’ కొత్త సినిమా...

Posted: 01/23/2015 12:27 PM IST
Director shankar tamil star ajith comibination movie kollywood news

కమర్షియల్-సైంటిఫిక్-విజువల్ వండర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనకుతానే సాటిగా నిలిచిన శంకర్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ‘ఐ’ చిత్రం దాదాపుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నిజానికి చిత్రంలో చూడదగ్గ వండర్స్’గానీ, కొత్త ఎలిమెంట్స్ ఏమీలేవు. ఓ సాధారణ రొమాంటిక్ రివేంజ్ స్టోరీలో యాక్షన్, లొకేషన్స్’ను అద్భుతంగా జోడించాడు. అయినా అది భారీగా వసూళ్లు రాబడుతోందంటే.. అదంతా శంకర్ క్రెడిట్టే!

ఎందుకంటే.. గతంలో ఏ ఒక్క పరాజయాన్ని ఎదుర్కోని ఈ దర్శకుడు ఇప్పటివరకు చిత్రాల్లో కొత్త ఎలిమెంట్స్’తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఇందులో కూడా వుంటుందని భావించి ఫ్లాప్ టాక్ వచ్చినా.. శంకర్ మార్క్ ఏదో ఒక్కటి ఖచ్చితంగా వుంటుందనే నమ్మకంతో థియేటర్’వైపు పరుగులు తీస్తున్నారు. అంటే.. శంకర్ మీద ప్రేక్షకులకు వున్న నమ్మకం అటువంటిది!

ఇకపోతే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఐ’ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతోపాటు శంకర్’కీ విమర్శలు తెచ్చిపెట్టింది కాబట్టి.. అతడు తదుపరి ప్రాజెక్ట్’ను ఎవరితో? ఏవిధంగా తెరకెక్కించబోతున్నాడు..? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘ఐ’తో ఎదుర్కొంటున్న విమర్శలకు ఎదురుదెబ్బగా శంకర్ కొత్త ఎలిమెంట్స్ కలిగిన కథాంశంతో జవాబు చెబుతాడనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇందుకు ఇతనికి తోడుగా తమిళ స్టార్ హీరో అజిత్ కూడా నిలవనున్నాడని సమాచారం!

అంటే.. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికీ ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయనీ, సబ్జెక్ట్ వర్క్ కూడా జరుగుతోందనీ అంటున్నారు. కొన్నిరోజుల అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శంకర్, అజిత్’తో కలిసి ఇదివరకే చిత్రాలు నిర్మించిన ఏ.ఎం.రత్నం.. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director shankar news  tamil hero ajith news  i movie collections  

Other Articles