Anushka shetty soggade chinni nayana special song nagarjuna hamsa nandini

anushka shetty news, anushka shetty special song, anushka shetty item songs, anushka shetty hot photos, anushka shetty love affairs, anushka affairs, anushka nagarjuna news, nagarjuna movies, soggade chinni nayana movie, hamsa nandini news, lavanya tripathi news

anushka shetty soggade chinni nayana special song nagarjuna hamsa nandini : anushka shetty to do a special song with nagarjuna in soggade chinni nayana movie

‘సొగ్గాడి’ వలలో చిందులేస్తున్న అనుష్క..

Posted: 01/23/2015 03:08 PM IST
Anushka shetty soggade chinni nayana special song nagarjuna hamsa nandini

గతంలో అనుష్కకు సంబంధించి లవ్ ఎఫైర్లపై ఎన్నో రూమర్లు, గాసిప్స్ తరుచుగా వచ్చాయి. అయితే వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తన కెరీర్ మీదే దృష్టి సారిస్తూ ముందుకు దూసుకెళ్తోంది అమ్మడు! మూడుపదుల వయస్సుదాటినా చెరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ భామపై ఇంకా అటువంటి రూమర్లే వస్తున్నాయి. ఆమధ్య తమిళ చిత్రాలు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని వార్తలొచ్చాయి గానీ.. అవి మళ్లీ కనుమరుగయ్యాయి. ఇక టాలీవుడ్’లో సైతం ఎంతో హీరోలతో ఈమెను లింక్ చేస్తూ వార్తల మీద వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! వీటితోబాటు మూవీలకు సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇక తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు సొగ్గాడి వలలో చిందులేస్తోందంటూ ప్రచారాలు సాగుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం అనుష్క భారీప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఇతర మూవీల్లో గెస్ట్ పాత్రల్లో నటిస్తోంది. కొన్ని మూవీల్లోని పాటల్లో చిందులు కూడా వేస్తోంది. అందులో భాగంగానే అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ రూపొందుతున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే చిత్రంలోనూ అతనితో కలిసి స్టెప్పులేయబోతోందని సమాచారం! ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఓ స్పెషల్ సాంగ్’ని అరేంజ్ చేయనున్నారని, అందులో నాగ్’తోపాటు అనుష్క, హంసానందిని చిందులేయబోతున్నారని టాక్!

ఇకపోతే.. ఈ చిత్రంలో వయసు మళ్లిన నాగార్జున పాత్రకు రమ్యక్రిష్ణ, అలాగే యంగ్’గా వుండే అతని పాత్రకు లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ మూవీలో బంపరాఫర్ కొట్టేసిందని, నాగార్జున సరసన మరదలుగా నటించడంతోబాటు అతనితో కలిసి డ్యూయెట్ కూడా చేయనుందని ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఏదైతేనేం.. ఈ చిత్రంలో నాగ్ మాత్రం ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles