Hero ram shivam future projects rashi khanna srinivas reddy

hero ram news, telugu hero ram news, ram shivam movie, pandaga chesko movie, pandaga chesko movie news, shivam movie updates, pandaga chesko movie updates, rashi khanna latest news, rashi khanna hot photos, rashi khanna latest photo shoot, rashi khanna cleavage show, ram rashi khanna

hero ram shivam future projects rashi khanna srinivas reddy : actress rashi khanna is selected as heroine in shiva movie in which she is paring with hero ram.

రామ్ ‘భవిష్య’వాణిలో కొత్త రాశి...

Posted: 01/23/2015 06:44 PM IST
Hero ram shivam future projects rashi khanna srinivas reddy

ఒకప్పుడు జూనియర్ హీరోల్లో ఓ వెలుగు వెలిగిన హీరో రామ్.. ఈమధ్య ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే! ‘కందిరీగ’ చిత్రం తర్వాత ఈ హీరో నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. చివరికి వెంకటేష్’తో కలిసి ‘మసాలా’వంటి కామెడీ ఎంటర్టైనర్ మల్టీస్టారర్ చిత్రంలో నటించినా.. అది కూడా బెడిసి కొట్టింది. దాంతో ఈ హీరో పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే.. ఎలాగోలా తన హీరోయిజాన్ని మళ్లీ నిరూపించుకోవాలనే భావనతో ఈ నటుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే.. తన కెరీర్’ని బాగా మలుచుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతని ‘భవిష్య’వాణిలో ఓ కొత్త రాశి ఎంటరైనట్లు సమాచారం!

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం రామ్ ‘పండగచేస్కో’ అనే చిత్రం షూటింగ్’లో బిజీగా వున్న విషయం తెలిసిందే! ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో వుండగానే.. అప్పుడే తన భవిష్య (ఫ్యూచర్) ప్రాజెక్ట్’ను కూడా అంగీకరించాడు. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి రూపొందించే ‘శివం’ మూవీలో నటించేందుకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ.. అప్పుడే కథానాయికను కూడా సెలెక్ట్ చేసుకుందని సమాచారం! ఇందులో ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశిఖన్నా కథానాయికగా నటిస్తోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం! ఇలా ఈ విధంగా ఈ రాశి, రామ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్’లో ఎంట్రీ ఇచ్చిందన్నమాట!

ఇదిలావుండగా.. రాశిఖన్నా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు గోపీచంద్ సరసన ‘జిల్’ సినిమాలో నటిస్తోంది. మరోపక్క సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు తాజాగా రామ్ సరసన ‘శివం’లో ఆఫర్ దక్కించుకుంది. ఇలాగే రాశికి వరుసగా ఆఫర్లు వస్తే.. త్వరలోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్’గా అవతారమెత్తే అవకాశాలు వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles