Tapsee pannu motivates lady fans martial arts talent

tapsee pannu news, tapsee pannu fighting scenes, tapsee pannu baby movie, baby movie news, baby movie updates, tapsee pannu baby movie role, tapsee pannu hot photo shoot, akshay kumar news, daggubati rana news

tapsee pannu motivates lady fans martial arts talent : tapsee pannu motivates her lady fans with martial arts fighting scenes in baby movie

మహిళలకు ఆదర్శంగా నిలిచిన తాప్సీ..

Posted: 01/24/2015 11:01 AM IST
Tapsee pannu motivates lady fans martial arts talent

పురుషులకు సమానంగా మహిళలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ.. ఇంకా దేశంలో వారికి సరైన గుర్తింపు లభించడం లేదు. దేశరాజధానిలోనే మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే.. ఇతర ప్రాంతాల్లో వారిపై ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఆకృత్యాల బారినుంచి మహిళలు తమనుతాము కాపాడుకోవాలంటే.. ఆత్మవిశ్వాసంతోపాటు వారిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. మార్షల్ ఆర్ట్స్, ఇతర యుద్ధపోరాటాలను నేర్చుకుంటే.. అత్యాచారాలకు పాల్పడేవారికి గుణపాఠం నేర్పవచ్చు. ఈ రకమైన సాహసం చేసే తాప్సీ ఇప్పుడు మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది.

అన్ని సవ్యంగా జరుగుతున్న సమయంలో తాప్సీ అనుకోకుండా దుండగుల చేతికి చిక్కింది. దాంతో వాళ్లు ఆమెను ఎత్తుకెళ్లి తమ రూంలో బందీగా వుంచుకున్నారు. ఆ తర్వాత తనపై దారుణానికి ఒడిగట్టడానికి వాళ్లు ప్రయత్నించగా.. తాప్సీ తనదైన స్టైల్లో వారికి పంచెస్ కొడుతూ తననుతాను కాపాడుకోగలిగింది. వారి బారినుంచి తప్పించుకుని సాహస వీరనారిగా పేరు తెచ్చుకుంది. అయితే.. ఇదంతా జరిగింది తాప్సీ రియల్ లైఫ్’లో కాదులెండి.. రీల్ లైఫ్’లో! నిజానికి.. ఇది మూవీకి సంబంధించినప్పటికీ.. అందులో తాప్సీ నటన మాత్రం అందరినీ ఆకట్టుకునేలా వుంది. సాటి మహిళల్లో ఆత్మబలాన్ని నింపేవిధంగా ఆమె తన నటనా టాలెంట్’తో నిరూపించుకుంది. దీంతో ఈమె నటనకు అందరూ ముగ్ధులైపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. తాప్సీ బాలీవుడ్’లో ‘బేబీ’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే! ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. విమర్శకుల సైతం ప్రశంసలందిస్తున్నారు. ఇక తాప్సీ పాత్ర విషయానికొస్తే.. ఈ చిత్రంలో ఆమె పాత్ర కేవలం 10 నిముషాలు మాత్రమే వున్నా ప్రేక్షకులను మాత్రం తన నటనతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా ఆ పాత్ర వుందని చెప్పుకోవచ్చు. ఒక రూంలో టెర్రరిస్ట్ చెరలో బందీగా వున్న తాప్సీ.. అతనిని ఎదుర్కొని, పోరాడి బయటపడిన విధానం ప్రేక్షకులను అలరించింది. ఆ సన్నివేశాల్లో భాగంగా ఈమె మార్షల్ ఆర్ట్స్’తో అతనితో ప్రతిఘటించడం అద్భుతంగా వుంది. ఈ పోరాట సన్నివేశాల్లో ఆమె ఎదుర్కొన్న టెక్నిక్ మహిళలను ప్రోత్సాహించే విధంగా వుంది. ఇది ఓ మూవీలో సన్నివేశం అయినా.. మహిళలకు ఆదర్శంగా నిలిచే విధంగా వుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee pannu baby movie  akshay kumar news  daggubati rana news  

Other Articles