Mahesh babu koratala siva movie updates jagapathi babu sukanya lead roles

mahesh babu latest news, mahesh babu movies, mahesh babu koratala siva movie, mahesh siva movie updates, mahesh babu shruti hassan news, mahesh babu gossips, jagapathi babu news, actress sukanya news, sukanya jagapathi babu, mahesh babu sukanya news

mahesh babu koratala siva movie updates jagapathi babu sukanya lead roles : jagapathi babu and sukanya may act as father and mother to mahesh babu latest movie which is to be directed by koratala siva.

చిన్నబాబు తల్లిదండ్రులుగా పెద్దరికం జోడి...

Posted: 01/24/2015 11:46 AM IST
Mahesh babu koratala siva movie updates jagapathi babu sukanya lead roles

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే! ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీకి అవసరమైన తారాగణాన్ని ఎంచుకునే పనిలో యూనిట్ బృందం నిమగ్నమైంది. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు ఇందులో మహేష్’కి తల్లిదండ్రుల పాత్రలకోసం ప్రముఖ నటీనటులను సెలెక్ట్ చేసుకోనున్నారు. ఇప్పటికే మహేష్’కి తండ్రిగా జగపతిబాబు ఫిక్స్’కాగా.. తల్లి పాత్రకోసం ఇంకా వేట కొనొసాగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేసీ సింగ్, నదియ వంటి మాజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే.. వీరికంటే కాస్త డిఫరెంట్’గా వుండాలని భావించిన యూనిట్ బృందం.. ఇప్పుడు తాజాగా ఈ తల్లి పాత్రకోసం ఓ అలనాటి మీరోయిన్ ఎంపిక చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

80, 90లలో హీరోయిన్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకన్యకు మహేష్’కు తల్లిగా నటించే ఆఫర్ దక్కిందని సమాచారం! అంటే.. జగపతిబాబుకి భార్యగా అన్నమాట! ఇక్కడో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జగపతిబాబు, సుకన్య జంటగా 1992లో వచ్చిన ‘పెద్దరికం’ అనే చిత్రంలో నటించారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి జోడి మూవీకి హైలైట్’గా నిలుస్తుందని చిత్రబృందం తెలుపుతోంది. అయితే.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కావల్సి వుంది.

ఇదిలావుండగా.. ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్’గా నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలకపాత్రల్లో కనువిందు చేయనున్నారు. మైత్రిమూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని యలమంచలి రవిశంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో వున్న ప్రత్యేక గీతంలో పూర్ణ, మహేష్’తో కలిసి స్టెప్పులేయనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles