Akkineni nagarjuna multistarrer movie role changes the untouchables remake

akkineni nagarjuna news, nagarjuna latest news, nagarjuna movie news, nagarjuna multistarrer movie news, nagarjuna karthi movie, nagarjuna shruti hassan, nagarjuna biography, nagarjuna tv shows

akkineni nagarjuna multistarrer movie role changes the untouchables remake : According to the tollywood sources.. the untouchables telugu movie remake unit members doing some changes in nagarjuna role.

నాగార్జునను మార్చేస్తున్నారు...

Posted: 01/24/2015 11:31 AM IST
Akkineni nagarjuna multistarrer movie role changes the untouchables remake

టాలీవుడ్ మన్మధుడిగా పేరొందిన నాగార్జున.. బుల్లితెరలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్నటివరకు వెండితెర ప్రేక్షకులకే పరిచయమైన ఈ నటుడు.. ఇప్పుడు బుల్లితెర ఆడియెన్స్’కు మరింత దగ్గరయ్యారు. దీంతో ఈయన పాపులారిటీ గతంలో కంటే మరింతగా పెరుగుతూ వస్తోంది. ఇంతేకాదు.. గతకొన్నాళ్ల నుంచి వెండితెరకు దూరంగా వున్న ఈయన త్వరలోనే ఓ మూవీతో సినీప్రేమికులకు కనువిందు చేయనున్నారు. కార్తీతో నాగ్ కలిసి ఓ మల్టీస్తారర్ స్టారర్ మూవీని చేయనున్నారు. అయితే.. ఈ మూవీలో అనుకోకుండా ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ చిత్రంలో నాగ్’ను మార్చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగ్-కార్తీ ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్లు అందరికీ తెలిసిందే! ‘ద ఇన్’టచబుల్స్’ అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్ పేషెంట్ పాత్రలో నటిస్తుండగా, అతనికి సేవలు చేసే మేల్ నర్సు పాత్రలో కార్తీ నటించనున్నాడని ఇదివరకే ప్రచారాలు కొనసాగాయి. అయితే.. ఈ మూవీలో వున్న పాత్రలను ఒరిజినల్’కు కాస్త భిన్నంగా మార్చుతున్నారని సమాచారం! ముఖ్యంగా నాగ్ పాత్రను తెలుగు ప్రేక్షకులకు మెచ్చేవిధంగా కాస్త మెరుగులు దిద్దుతున్నారని ఇండస్ట్రీవర్గాల సమాచారం!

నిజానికి ఒరిజినల్ మూవీలో నాగ్ నటిస్తున్న పేషెంట్ పాత్రలో హీరో మెడ తప్ప మిగతా శరీరభాగమంతా పక్షవాతంతో చచ్చబడిపోయిన రోగిగా వీల్ చైర్లో కనిపిస్తుంది. అయితే ఈ రకమైన పాత్రలో అభిమానులు నాగార్జునను రిసీవ్ చేసుకోలేరు కాబట్టి.. ఆ పాత్రను కాస్త వినోదాత్మకంగా మారుస్తున్నారు. అలాగే.. ఇందులో నాగ్ పాత్ర అందరినీ అలరించే విధంగా రూపుదిద్దుతున్నారని అంటున్నారు. ఏదిఏమైనా.. ప్రస్తుతం నాగ్ అన్నిరంగాల్లోనూ బిజీబిజీ షెడ్యూల్స్’తో బాగానే గడిపేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles