ప్రతిఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక చేదు అనుభవం ఖచ్చితంగా ఎదురవుతుంది. అనుకోకుండా ఎదురయ్యే ఆ ఘటన జీవితాంతం మానసికంగా వేధిస్తూనే వుంటుంది. ఎంత మరిచిపోవాలనుకున్నా.. అది సాధ్యం కాదు. అటువంటి సంఘటనే తనకూ ఎదురైందని నటి తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఆ తప్పు చేయకుండా వుండి వుంటే ఆనందంగా తన జీవితాన్ని ఆస్వాదించేదని పేర్కొంది. తాను చేసిన ఆ తప్పు ఎంతగా మరిచిపోవాలని అనుకుంటున్నప్పటికీ.. అది సాధ్యపడడం లేదని అందరితో బాధను పంచుకుంది. అందరితో కలిసిమెలిసి వుండే తన స్వభావమే మోసం చేసిందంటూ ఆమె వాపోయింది.
తన చేదు అనుభవం గురించి తాప్సీ తెలుపుతూ.. ఓ మూవీ షూటింగ్ నేపథ్యంలో తాను హైదరాబాద్’లో కొన్నాళ్లు ఒంటరిగా వుండాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో తనపై ప్రేమాభిమానాలను కురిపించిన వాళ్లను ఎక్కువగా నమ్మినట్లు పేర్కొన్న తాప్సీ.. ఒకరితో చాలా సన్నిహితంగా మెలిగినట్లు స్పష్టం చేసింది. తన తండ్రి రియల్ ఎస్టేట్ సంస్థలో ఓ చిరు ఉద్యోగి అయిన ఓ వ్యక్తితో తాను ఎంతో సన్నిహితంగా వున్నానని, అతనితో కొన్నాళ్లు ఎంజాయ్ చేశానని తెలిపిన ఈ పంజాబీ అమ్మడు.. అదే తన జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతడితో బ్రేకప్ అయినట్లు కూడా పేర్కొంది.
అయితే.. అతడితో విడిపోయినందుకు కలిగిన ఆ బాధ కేవలం ఒక వారం రోజుల వరకు మాత్రమే వుందని సంతోషంగా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. ఒక నటుడికి, నటికి మధ్య అనుబంధం నితంతరం సాగుతుందని చెప్పలేమని పేర్కొంది. అంతా బాగానే వుంది కానీ.. ఓసారి చిరు ఉద్యోగిని నమ్మి తప్పు చేశానని చెప్పిన తాస్పీ.. నటీనటుల మధ్య సంబంధం గురించి ఎందుకు ప్రస్తావించింది..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే.. ఈ అమ్మడు ఏ నటుడితోనో ప్రేమ వ్యవహారం నడిపిందా..? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more