Kasturi raja check bounce case chennai megistrate court issued rajinikanth dhanush

director kasturi raja, dhanush father kasturi raja, rajinikanth brother in law kasturi raja, rajinikanth latest news, hero dhanush latest news, kasturi raja arrest warrant, tamil directors, kasturi raja latest news, kasturi raja court summons, chennai georgetown megistrate court, rajinikanth legal problems, kasturi raja legal problems, hero dhanush father news

kasturi raja check bounce case chennai megistrate court issued rajinikanth dhanush : Hero Danush's father, director Kasthuri Raja has to face legal troubles now. A local Chennai court issued an arrest warrant against him after he failed to attend the court in connection with a cheque bounce case.

రజనీకాంత్ బావకు అరెస్ట్ వారెంట్ జారీ..

Posted: 02/03/2015 01:01 PM IST
Kasturi raja check bounce case chennai megistrate court issued rajinikanth dhanush

సూపర్ స్టార్ రజనీకాంత్ బావ - హీరో ధనుష్ తండ్రి - తమిళ ప్రముఖ దర్శకుడు అయిన కస్తూరి రాజా చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కుపోయారు. చెన్నైలోని స్థానిక కోర్టు ఈయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చిత్రపరిశ్రమలో ఎంతో పలుకుబడి సాధించిన కస్తూరికి.. అనుకోకుండా కొన్ని సమస్యలు చుట్టుకోవడంతో ఇలా లీగల్ సమస్యల్లో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అసలు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేంత తప్పు ఏం చేశాడు..? అనేగా సందేహం! అది తెలుసుకోవాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

కస్తూరిరాజా 2012లో ముకుంద్ చంద్ బోద్రా అనే ఫైనాన్షియర్ దగ్గర 65 లక్షల వరకు లోన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫైనాన్షియర్ ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తివివరాలు, బ్యాంక్ ఖాతాలు తదితర సెక్యూరిటీ చెక్స్ తీసుకున్నాడు. అలా వారిమధ్య అప్పట్లో ఒప్పందం కుదిరింది. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల కస్తూరిరాజా తీసుకున్న లోన్’ను ఆ ఫైనాన్షియర్’కు తిరిగి ఇవ్వలేకపోయారు. తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సదరు ఫైనాన్షియర్ ఎన్నిసార్లు కోరినా.. ఆయన నుంచి ఎటువంటి సమాధానం అందలేదు. దీంతో గత ఒప్పందం ప్రకారం తన దగ్గర వుంచుకున్న సెక్యూరిటీ చెక్స్’ను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. అయితే అవి బౌన్స్ అయినట్లు తేలాయి.

ఆ సెక్యూరిటీ చెక్స్ బౌన్స్ అయిన నేపథ్యంలో ఫైనాన్షియర్, కస్తూరిరాజాపై చెన్నైలోని జార్జిటౌన్ మెజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు.. ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పైగా.. ఈ కేసులో ఈయన తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఆ నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని చెన్నై నుంచి వార్తలొస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles