Mahesh babu puri jagannath vakkantham vamsi temper script writer tollywood news

mahesh babu news, director puri jagannath, writer vakkantham vamsi news, kajal agarwal, junior ntr news, temper movie news, temper movie story, mahesh babu koratala siva, mahesh babu puri jagannath, mahesh puri news, mahesh kajal news, mahesh junior ntr news

mahesh babu puri jagannath vakkantham vamsi temper script writer tollywood news : director puri jagannath gave chance to vakkantham vamsi to write a story for mahesh babu movie.

మహేష్’కి ‘టెంపర్’ ఎక్కిస్తున్న పూరీ..

Posted: 02/05/2015 11:00 AM IST
Mahesh babu puri jagannath vakkantham vamsi temper script writer tollywood news

దర్శకుడు పూరీజగన్నాథ్ తాజాగా ‘టెంపర్’ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే! ఈ మూవీలాగే పూరీ మహేష్’కి ‘టెంపర్’ ఎక్కించనున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అసలు ఆ సినిమాకు, మహేష్’కి, పూరీకి సంబంధం ఏంటనేగా మీ సందేహం..! అది తెలుసుకోవాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

పూరీ, మహేష్ కాంబినేషన్’లో త్వరలోనే ఓ చిత్రం రూపొందనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన సంగతి విదితమే! ఆ సినిమా కోసం కథను సమకూర్చేందుకు దర్శకుడు పూరీ ‘టెంపర్’ చిత్రానికి కథ అందించిన వక్కంతం వంశీకి అప్పజెప్పాడట! ఆ మూవీకోసం ఈ రచయిత అందించిన కథకు, పనితనానికి ఇంప్రెస్ అయిన పూరీ.. మహేష్’తో చేయనున్న చిత్రానికి కూడా కథను రూపొందించే పనిని వంశీకే ఇచ్చాడట! ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పూరీ తన కెరీర్’లోనే ఇతర రచయిత నుంచి కథ తీసుకున్న వైనం ‘టెంపర్’ మూవీ విషయంలోనే జరిగింది. వంశీ కథను అద్భుతంగా అందించడంతో ఫ్లాట్ అవడంతో.. ఇప్పుడు మహేష్’తో తీయనున్న మూవీకి ఆఫర్ ఇచ్చాడు. దీంతో పూరీ ఇచ్చిన ఈ భారీ ఆఫర్’ను అందిపుచ్చుకున్న వంశీ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ మూవీకి కథను అందించే పనిలో నిమగ్నమయ్యాడట!

ఇదిలావుండగా.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ హీరోగా నటిస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ అయిన తర్వాత పూరీతో చేస్తాడా..? లేక త్రివిక్రమ్’తో చేస్తాడా..? అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు.. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘టెంపర్’ చిత్రం ఫిబ్రవరి 13వ తేదీ రిలీజ్’కి రెడీగా వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu news  director puri jagannath news  temper movie  

Other Articles