Balakrishna 99th film director gopi mohan eros international nayanatara hansika regina cassandra

balakrishna 99 movie, balakrishna gopi mohan movie, balakrishna movies, balakrishna movies list, balakrishna nayanatara, regina cassandra, eros international, eros international movies, hansika motwani news

balakrishna 99th film director gopi mohan eros international nayanatara hansika regina cassandra : It is confirmed that balakrishna 99th movie will be produced by eros international.

‘ఇంటర్నేషనల్’ బ్యానర్’లో బాలయ్యకు బంపరాఫర్

Posted: 02/06/2015 07:17 PM IST
Balakrishna 99th film director gopi mohan eros international nayanatara hansika regina cassandra

‘లెజెండ్’ సినిమాతో తన సత్తా చాటుకుని 50 కోట్ల క్లబ్’లోకి చేరిన నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం ‘లయన్’ మూవీ షూటింగ్’లో బిజీగా వున్న విషయం తెలిసిందే! ఎడతెరిపి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ దాదాపు చివరిదశకు చేరుకుంది. బాలయ్య 98వ చిత్రమైన ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే బాలయ్యకు ఓ బంపరాఫర్ లభించింది. ఓ ఇంటర్నేషనల్ బ్యానర్’లో బాలయ్య త్వరలోనే చిత్రం చేయనున్నాడని అధికారిక వార్త వెలువడింది.

గతకొన్నాళ్ల నుంచి బాలకృష్న 99వ చిత్రం ప్రముఖ దర్శకుడు గోపీ మోహన్ దర్శకత్వంలో రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ నిర్మించనున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్త నిజమేనంటూ కన్ఫర్మ్ అయింది. బాలయ్యతో 99వ చిత్రాన్ని భారీ బడ్జెట్’తో నిర్మించేందుకు ఈరోస్ సంస్థ అంగీకారం తెలిపినట్లు తాజా సమాచారం! ‘లెజెండ్’ సినిమా ఘనవిజయం సాధించడంతోనే ఆ సంస్థ బాలయ్యతో మూవీ చేసేందుకు సిద్ధమయ్యిందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.

ఇదిలావుండగా.. బాలయ్య 99వ మూవీకోసం మొదటిసారిగా రముఖ రచయితలు గోపి మోహన్, కోన వెంకట్ లు కలిసి కథను అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గోపి మోహన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. ‘‘We r working with NBK for the 1st time.Designed a powerful character with good content.Makers will announce the powerful Title &Team soon:)’’ అంటూ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతానికి నయనతార, హన్సిక, రెజీనాల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరైనా ఇద్దరూ బాలయ్యతో జతకట్టనున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : balakrishna 99 movie  eros international movies  nayanatara regina hansika  

Other Articles