Actor mohan lal returns money

mohan lal returns money, malayam top actor mohanlal, National Games curtain riser show, actor mohanlal flopped show, Mohan lal, National Games, curtain riser show, kerala chief minister oomen chandy,

malayam top actor mohanlal returns money taken for flopped show organised as curtain riser for national games

మోమన్ లాలా.. మజాకా.. మాటంటే మాటే..!

Posted: 02/07/2015 08:07 AM IST
Actor mohan lal returns money

మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాలా మజాకా.. ఆయన మాటంటే మాటే. సినిమాలలో విమర్శ పాలైన హీరోలు పారితోషకాన్ని తిరిగిచ్చి వారి నిజాయితీని చాటుకోవడం పరిపాటి. సినిమాలు హిట్ అయినా.. కాకపోయినా తమకు సంబందం లేదన్నట్లుగా పారితోషకాన్ని ముందే తీసుకునే హీరోలు.. అప్పుడప్పుడు తమ పారితోషకాలను వెనుతిరిగి ఇచ్చిన ఘటనలు మనం చూశాం. అయితే ఇప్పుడు మోహన్ లాల్ కూడా సరిగ్గా అలాంటి పనే చేశాడు.

కేరళలోని తిరువనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో మోహన్ లాల్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోవడం.. మరోవైపు ప్లాప్ షో అంటూ విమర్శలు రావడం.. ప్రజాధనం వృధా అయ్యిందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. దీంతో కార్యక్రమా నిర్వహణకు గాను కేరళ ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ.1.63 కోట్ల మొత్తాన్ని మోహన్లాల్ తిరిగి ఇచ్చేశారు. మోహన్ లాల్ ఈ మొత్తానికి చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంపై విమర్శలు రావడంతో పారితోషకం వెనక్కు ఇస్తానని మోహన్ లాల్ ప్రకటించారు.

కాగా మోహన్ లాల్ ఇచ్చేస్తానన్న డబ్బు తీసుకోబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంద్ ఇంతకుముందు చెప్పారు. నైతికంగా ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. మోహన్ లాల్ చెక్ అందజేసినా దీన్ని అంగీకరించాలా వద్దా అన్న విషయం గురించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆదేశాలూ రాలేదని క్రీడల నిర్వాహకులు చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan lal  National Games  curtain riser show  

Other Articles