Anushka shetty prakash kovelamudi lady oriented movie tollywood news raghavendra rao

anushka shetty, anushka latest news, anushka lady oriented movie, anushka shetty prakash kovelamudi, anushka raghavendra rao, anushka shetty hot photo shoot, anushka bahubali, anushka rudramadevi, bahubali movie news, rudramadevi movie news, anushka shetty sexy photos, anushka shetty bikini photos

anushka shetty prakash kovelamudi lady oriented movie tollywood news raghavendra rao : Finally Anushka Shetty has given green signal to act in prakash kovelamudi directorial movie which will go on floors soon.

దర్శకుడిని సంతృప్తి పరిచిన అనుష్క..

Posted: 02/07/2015 10:58 AM IST
Anushka shetty prakash kovelamudi lady oriented movie tollywood news raghavendra rao

ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా వున్న అనుష్కశెట్టిని గతకొన్నిరోజులనుంచి ఓ దర్శకుడు వెంటపడుతున్నాడని సమాచారం! కానీ.. అనుష్క బిజీ షెడ్యూల్’లో వున్న కారణంగా అతనితో కలవడానికి కుదరలేదు. అయితే.. ఇటీవల ఆ రెండు మూవీల షూటింగ్’లు ముగిసిన నేపథ్యంలో ఆమె సదరు దర్శకుడితో కలిసి అతనిని తన నిర్ణయం ద్వారా సంతృప్తి పరిచిందని తెలుస్తోంది. దీంతో ఇదివరకు చాలా టెన్షన్’గా వున్న ఆ దర్శకుడు.. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. గతకొన్నాళ్ల నుంచి కొందరు దర్శకనిర్మాతలు అనుష్కను తమ సినిమాల్లో నటించాల్సిందిగా కోరుతూ అప్రోచ్ అవుతున్నారు. కానీ.. ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’ చిత్రాల షూటింగులతో బిజీగా వుండటంతో ఏ ఒక్కరికి ఓకే చెప్పలేదు. పైగా.. ఈమెకు వయస్సు మీరిపోతుండటంతో కుటుంబసభ్యులు ఈ బొమ్మాళికి పెళ్లి చేయాలనే అభిప్రాయంతో వున్నారట! దీంతో ఆమె ఆందోళనలో వుండగా.. ఏ సినిమాను ఒప్పుకోకుండా పెండింగ్’లో పెట్టేసింది. అయితే.. ఆ మూవీ చిత్రీకరణలు ముగియడంతో తాజాగా ఈ అమ్మడు కేవలం ఒకే ఒక్క సినిమాకు గ్రీన్ ఇచ్చిందని సమాచారం!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూవీ హీరోయిన్ ప్రధాన పాత్ర కలిగిన ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ పాత్రకు అనుష్కనే సూట్ అవుతుందన్న ఉద్దేశంతో దర్శకుడు అనుష్కను అప్రోచ్ అయ్యాడు కూడా! అయితే.. అప్పట్లో ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ.. ఇప్పుడు ఫ్రీగా వుండటంతో ఓకే చెప్పేసిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles