Alia bhatt college love affairs bollywood young heroes rumours

alia bhatt news, alia bhatt affairs, alia bhatt love affairs, alia bhatt college affairs, alia bhatt dating, alia bhatt boyfriends, alia bhatt hot photos, alia bhatt hot photo shoot, alia bhatt topless, bollywood rumours, bollywood gossips, bollywood news

alia bhatt college love affairs bollywood young heroes rumours : Bollywood sexy young actress alia bhatt shares her college days love affairs.

కాలేజీ రోజుల్లో ఆలియా ‘లవ్’ ఎఫైర్లు...

Posted: 02/21/2015 06:54 PM IST
Alia bhatt college love affairs bollywood young heroes rumours

సాధారణంగా తారలు తమ వ్యక్తిగత వ్యవహారాలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా లవ్ ఎఫైర్ల విషయానికొస్తే మాత్రం ఏదో ఒకటి చెబుతూ తప్పించుకుంటుంటారు. పలానా హీరోతో ప్రేమాయణం నడుపుతున్నారు కదా..? అంటే అందుకు ‘‘తూచ్.. అలాంటిదేమీ లేదు’’ అని అంటారు. కానీ.. ఆలియా భట్ మాత్రం తన లవ్ ఎఫైర్ల గురించి విశ్లేషించి చెబుతోంది. తన కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడిపోయానంటూ స్పష్టం చేసింది.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు-నిర్మాత మహేష్ భట్ కూతురైన ఆలియా.. అతి తక్కువ కాలంలోనే తన నటనతో, గ్లామర్ తో మంచి గుర్తింపు సాధించింది. అయితే.. ఈమె తన సినిమాలకంటే ఎఫైర్లతోనే ఎక్కువ ఫేమస్ అయిందిలెండి! ప్రస్తుతమున్న యంగ్ హీరోలందరితోనూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈమెపై ఎన్నోరకాల ఎఫైర్ల రూమర్లు వచ్చాయి. గతంలో నలుగురు యువకులతో ప్రేమాయణం నడిపిందని, అయితే వారితో బ్రేకప్ అయి ఇప్పుడు షాహిద్ తో లవ్ ఎఫైర్ నడుపుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతనితో ఈమె ఓ మూవీలో నటిస్తోంది కాబట్టి.. ఈ రూమర్లు బయటికొచ్చాయి. దీనిపై స్పందించిన ఆలియా.. తాను ఎవరితోనూ ప్రేమాయణం నడపడం లేదంటూ స్పష్టం చేసింది. కానీ.. తన కాలేజీ రోజుల్లో మాత్ర రెండుసార్లు లవ్ లో పడినట్లు గుర్తు చేసుకుంది.

‘‘కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నేను రెండుసార్లు ప్రేమలో పడి, ఫెయిలయ్యాను. మొదట ఓ కుర్రాడితో ప్రేమలో పడ్డాను. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుని ఫిక్స్ అయ్యాను కూడా! కానీ అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాం. ఆ తర్వాత మళ్లీ ఇంకో అబ్బాయితో లవ్ లో పడ్డాను. అది కూడా కొన్నాళ్లకే బెడిసి కొట్టింది. ఆ ప్రేమ కూడా బ్రేకప్ అయింది. వాళ్లిద్దరి స్వభావాలు నచ్చకపోవడం వల్లే నేను వాళ్లను వదిలేశాను. ఇక అప్పటినుంచి ప్రేమ జోలికే వెళ్లలేదు. ప్రస్తుతం నేను సింగిల్ గానే వున్నాను’’ అంటూ ఆలియా పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt love affairs  bollywood heroines affairs  tollywood news  

Other Articles