Rey pawanisam special song release function pawan kalyan guest

rey movie news, rey movie songs, rey movie title song, rey movie pawan song, rey movie updates, yvs choudhury news, rey yvs choudhury news, pawan kalyan news, pawan kalyan updates, pawan kalyan rey movie, pawan kalyan twitter, pawan kalyan gallery, pawan kalyan controversy, yvs choudhury news

rey pawanisam special song release function pawan kalyan guest : Pawan kalyan may visit to rey special pawanisam song launch as special guest.

‘రేయ్’ వేడుకలో పవన్ కల్యాణ్ ‘పవర్’!

Posted: 03/11/2015 12:29 PM IST
Rey pawanisam special song release function pawan kalyan guest

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తొలిచిత్రం ‘రేయ్’ అప్పట్లో ఫైనాన్షియల్ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరీ ఈ మూవీని ఘనంగా విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీని ఈనెల 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు కూడా!

ఇదిలావుండగా.. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించిన విషయం తెలిసిందే! ‘పవనిజం’ పవర్ ను వివరించే ఈ పాటను ఈనెల 14వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం వైవీఎస్ చౌదరి హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మెగాభిమానుల సమక్షంలో విడుదల చేయనున్న ఈ గీతాన్ని దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ రాశారు. పాప్ సింగర్ నోయల్ షాన్ ఈ పాడను పాడారు.

ఇక విశేషం ఏమిటంటే.. ఈ ప్రత్యేక పాట విడుదల వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని సమాచారం! ఆయన చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేస్తారని ఆ మూవీ యూనిట్ వెల్లడించింది. పవన్ పేరిట వున్న ఈ పాటను ఆయన ద్వారా విడుదల చేస్తే ఆ సాంగ్ తోపాటు మూవీకి మరింత క్రేజ్ వస్తుందన్న నమ్మకంతో భారీగా ఖర్చుపెట్టి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rey movie news  pawan kalyan  yvs choudhury  pawanisam special song  

Other Articles