Ram charan tej little fan balabhairava parashuram magadheera dialogues

ram charan news, ram charan latest news, ram charan magadheera news, balabhairava, magadheera dialogues child, parashuram magadheera dialogues, balabhairava videos, magadheera dialogues youtube

ram charan tej little fan balabhairava parashuram magadheera dialogues : Finally ram charan is all set to meet youtube balabhairava parashuram who immitates his magadheera dialogues and impressed everyone.

ఫలించిన చెర్రీ ఆశయం.. 14వ తేదీన రంగం సిద్ధం!

Posted: 03/11/2015 05:35 PM IST
Ram charan tej little fan balabhairava parashuram magadheera dialogues

దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన ‘మగధీర’ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే! తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది ఆ మూవీ! ఎందుకంటే.. అందులోని ప్రతిఒక్క సన్నివేశం, డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చెర్రీ 100 మందిని చంపే సన్నివేశంలో భాగంగా ఇతనికి, షేర్ ఖాన్ (శ్రీహరి) మధ్య వున్న డైలాగులు బాగానే పాపులర్ అయ్యాయి. ఈ డైలాగ్స్ పెద్దలనేకాదు, చివరకు చిన్నారులనూ ఎంతగానే ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ ఆ డైలాగులకు ఇంకా ఆదరణ కొనసాగుతోంది. అందుకు ఉదాహరణగా తాజాగా ఓ బాలుడు చెప్పిన ఆ మగధీర డైలాగ్స్ వీడియో ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్‌లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోని చూసిన చెర్రీ.. ఆ బాలుడి టాలెంట్‌కి ఫిదా అయిపోయి అతడ్ని కలవాలని నిశ్చయించుకున్నాడు. ఆ బాలుడి వీడియోను తాను ప్రతీరోజూ చూస్తానని.. అతని టాలెంట్ తనను ఆకర్షించిందని.. ఆ కుర్రాడిని కలవాలని వుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు అడ్రస్ కోసం ఆరా తీయాలని తన సన్నిహితులకు ఫేస్‌బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేశాడు. దీంతో చెర్రీ కోరిక మేరకు స్పందించిన అతని ఫ్యాన్స్... వెంటనే ఆ బుల్లి స్టార్ ను వెతకడం ప్రారంభించారు. చివరికి అతను ఎక్కడుంటాడు, అతని పేరేంటి, కుటుంబ నేపథ్యమేంటి..? అన్న వివరాలను వాళ్లు తెలుసుకోగలిగారు. అలా ఆ విధంగా ఆ బుల్లి స్టార్ వివరాలు బయటి ప్రపంచానికి తెలిశాయి.

మహబూబ్ నగర్ జిల్లాలో అయిజకు చెందిన పేద దంపతుల కొడుకే ఈ పరశురామ్. తల్లిదండ్రులూ గొర్రెల కాపరులే! పేదరికం కారణంగా ఈ బుడ్డోడు బడికి వెళ్లలేకపోయాడు. చదువుకోకపోయినా ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేస్తాడు. అంతేకాదు.. చూసిన సినిమాలో డైలాగులు చెప్పడంలో పరశురాం దిట్ట. ఆ విధంగానే చెప్పిన మగధీర సినిమా డైలాగుల్ని స్థానిక యువకులు షూట్ చేసి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే! అప్పటినుంచి ఆ వీడియోకు లక్షల కొద్దీ లైకులు.. కామెంట్లు. ఈ విషయం ఆనోటా ఈనోటా తిరుగుతూ చివరికి చెర్రీదాకా వెళ్లింది. ఆ వీడియోను చూసి చెర్రీ ఒక్కసారిగా షాకయ్యాడు.

గ్యాప్ లేకుండా డైలాగులు చెప్పిన ఆ బుడ్డోడి టాలెంట్ కి ఫిదా అయిపోయాడు. దీంతో అతనిని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని ఫ్యాన్స్ ఆ బుల్లి స్టార్ ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో చెర్రీ అతనికి కలిసేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 14వ తేదీన రామ్ చరణ్ ఆ అబ్బాయిని కలిసేందుకు వెళుతున్నాడని సమాచారం! చెర్రీ కలయికతో ఆ అబ్బాయి భవిష్యత్ పేదరికం నుంచి బయటపడి సరికొత్త ప్రపంచాన్ని ఆస్వాదించగలుగుతాడని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే చెర్రీ ఇలా ఎంతోమంది పేదపిల్లలను ఆదుకుని వారికి జీవనాధారం కల్పించాడు. ఇప్పుడు ఈ పిల్లాడి భవిష్యత్ బాధ్యతల్ని కూడా చెర్రీ తీసుకోవడానికి రెడీ అయ్యాడు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles