Son of satyamurthy allu arjun trivikram srinivas samantha ruth prabhu nityamenon

allu arjun, son of satyamurthy, trivikram srinivas, samantha ruth prabhu, nitya menon, adah sharma, prakash raj, vennela kishore, brahmanandam, allu arjun son of satyamurthy, allu arjun samantha

son of satyamurthy allu arjun trivikram srinivas samantha ruth prabhu nityamenon : The teaser of allu arjun's latest flick son of satyamurthy has released. In this movie allu looks very stylish than his past movies.

టీజర్: సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు స్టైల్ అదుర్స్

Posted: 03/12/2015 10:48 AM IST
Son of satyamurthy allu arjun trivikram srinivas samantha ruth prabhu nityamenon

తెలుగు సినిమా హీరోల్లో ఫ్యాషన్ ఐకాన్’గా పేరుగాంచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మరోసారి తన స్టైల్ తో అందిరిని మాయ చేస్తున్నాడు. ఆర్య2 సినిమాతో తన గెటప్‘ను మార్చి కొత్త లుక్స్ తో ప్రేక్షకులకు చేరువయ్యాడు ఈ నటుడు! ఇక అప్పటి నుంచి టాలీవుడ్ ఫ్యాషన్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడు.. తాజాగా మరో క్రేజీ లుక్స్ తో అందరినీ పిచ్చెక్కిస్తున్నాడు.

అల్లుఅర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ప్రీ-రిలీజ్ ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్ కి మాంచి స్పందన లభించింది. ఆ ఫోటోల్లో అల్లు సరికొత్త స్టైలిష్ లుక్ కనువిందు చేశాడు. ఇప్పుడు తాజాగా అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ ని యూనిట్ విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ లుక్స్ కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. బీచ్ లో బోట్ పై అల్లు అర్జున్ ఎంట్రీ సూపర్ గా ఉంది. ‘చల్ చల్ చలో.. లైఫ్ సే మిలో..’ అంటూ వచ్చే పాట, అల్లు కొత్త లుక్స్ ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ ను పెంచుతున్నాయి. టీజరే ఇంత స్టైలిష్ గా ఉంటే, సినిమా ఎంత స్టైలిష్ గా ఉంటుందో అని అప్పుడే టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

 అల్లు అర్జున్ ఫ్యాన్స్ పల్స్ మరింత పెంచుతూ విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టీజర్ ను చూస్తుంటే.. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడం ఖాయమని అల్లు ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. రీసెంట్ గా ‘రేసుగుర్రం’ సినిమాతో భారీ వసూళ్లను రాబట్టిన ఈ మెగాహీరో.. ఇప్పుడు సత్యమూర్తి కొడుకుగా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  son of satyamurthy  samantha  nitya menon  trivikram srinivas  

Other Articles