టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ అలియాస్ కళ్యాణ్ కోడూరి సంగీతం కనువిందు చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణికి స్వయాన సోదరుడైన కళ్యాణ్ మాలిక్.. గతంతో ఆయనతో కలసి అనేక చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ చిత్రాలకు పనిచేసి అపార అనుభవాన్ని కూడా సంపాదించాడు. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాకు కళ్యాణ్ మ్యూజిక్ అందించాడు. గత ఏడాది ‘ఏం సందేహం లేదు’ అంటూ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకి ఇచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే గతంలో ‘అలా మొదలైంది’ లాంటి బ్లాక్ బస్టర్ కి కూడా మ్యూజిక్ అందించాడు. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించినా కళ్యాణి మాలిక్ చాలా లో ప్రొఫైల్ ని మెయిన్టెయిన్ చేస్తుంటాడు. అయితే అయన విషయంలో ఓ రూమర్ కూడా ఫిల్మనగర్ వీధుల్లో చక్కర్లు కోడుతోంది.
అదేంటి లో ఫ్రోఫైల్ మేయింటేన్సన్ అంతలా అపఖ్యాతిని ఆపాదిస్తుందా..? అనుకుంటున్నారా..? అంతేకదా అనేక రంగుల మాయాలోకం సినిమా రంగం. అక్కడ చిన్న అవకాశం దోరికినా బిల్డప్ లకు మాత్రం కొదవుండదు.. అయితే బంపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించి సాదారణంగా వుంటే.. రూమర్లు కామనే కదా..! కళ్యాణ్ మాలిక్ విషయంలో చక్కర్లు కోడుతున్న రూమర్ విషయానికి వస్తే.. ఆయన చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటాడని, అందరితో కలిసి పనిచేయలేడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాలపై ఆయనే స్వయంగా కార్లీటీ ఇచ్చారు. ‘అందులో అస్సలు నిజం లేదు. అనుకోకుండా తాను పలువురు డైరెక్టర్స్ తో మాత్రమే పనిచేస్తాననే వార్త ఎందుకు వచ్చింది అనేది తనకే అర్థం కావట్లేదన్నారు. తాను అందరు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేయాలని అనుకుంటున్నాట్లు చెప్పారు. తాను కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి వ్యతిరేఖిని కాదని’ ఆయన తెలిపాడు. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన కళ్యాణి మాలిక్ కి కమర్షియల్ గా మంచి హిట్ లభించి.. మ్యూజిక్ డైరెక్టర్ గా మరో అడుగు ముందుకు వేయాలని కోరుకుందాం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more