ప్రముఖ డ్యాన్సర్ - దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం ‘కాంచన-2’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! మొదట ‘ముని’ చిత్రంతో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్ గా ‘కాంచన’ చిత్రాన్ని రూపొందించాడు లారెన్స్! ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ‘కాంచన-2’ పేరిట మరో సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు! ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సరికొత్తగా వుండే ఆ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ లుక్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఫస్ట్ లుక్ ఓ భక్తుడి రూపంలో కనిపించిన లారెన్స్.. ఇప్పుడు ఈ రెండో లుక్ లో ఓ వృద్ధురాలి గెటప్ లో కనువిందు చేశాడు. ఈ లుక్ కి అప్పుడే నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మొదటి రెండు లుక్స్ లో ఇంత ఆసక్తి రేపుతుంటే.. ఇక సినిమాలో లారెన్స్ ఇంకా ఎన్ని గెటప్ లో కనిపించి, ప్రేక్షకుల్ని అబ్బురపరచనున్నాడోనని చర్చించుకుంటున్నారు. గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీ బంపర్ హిట్ కొడుతుందన్న నమ్మకాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ సినిమా ఏ రేంజులో హిట్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే!
ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పోస్టర్లను చూస్తుంటే.. గత సినిమాలకంటే ‘కాంచన -2’ మరింత హిట్ చిత్రంగా నిలిచేలా దర్శకుడు లారెన్స్ తెగ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more