Bandla ganesh controversy comments on dasari

Bandla Ganesh Controversy comments on Dasari Narayana rao, Bandla Ganesh comments on Dasari, Dasari Narayana rao speech at Son of Sathyamurthy Audio Launch, Son of Sathyamurthy Audio Launch, Son of Sathyamurthy Audio, Son of Sathyamurthy songs, Son of Sathyamurthy trailer, Son of Sathyamurthy movie news, Son of Sathyamurthy movie updates, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates

Bandla Ganesh Controversy comments on Dasari: Allu Arjun latest movie Son of Sathyamurthy. Motion Poster Released. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

దాసరిపై బండ్ల గణేష్ సెటైర్లు

Posted: 03/16/2015 06:07 PM IST
Bandla ganesh controversy comments on dasari

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బన్నీలను దాసరి పొగడటం... చిరంజీవి ప్రస్తావన అసలే తీయకపోవడంతో దాసరి మాటలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి తాను కేవలం అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీదున్న గౌరవంతోనే వచ్చానని అన్నారు. మీరు(అభిమానులు) సైలెంట్ గా వుంటే మాట్లాడుతా... మీరంతా ఫంక్షన్లకు వచ్చి, మీ అభిమానాన్ని చాటుతున్నారు. కానీ మీ హీరో గురించి, ఆ హీరో సినిమాల గురించి ఎవరైనా పెద్దలు మాట్లాడితే... అవి వినేటంతా ఓపిక లేకపోతే... ఫంక్షన్లకు మాలాంటి వాళ్లు రావడం వేస్ట్. గంగోత్రి సినిమా నుంచి అల్లు అర్జున్ ను తాను చూసానని దాసరి అన్నారు. ఆ తర్వాత బన్నీ తనకు తానుగా ఓ కొత్త స్టైల్ ను ఏర్పాటు చేసుకున్నాడు అని అన్నారు.

సినిమాల్లో వుండే నటీనటులకు ఓ స్టైల్ వుంటుంది. ఎన్టీఆర్, అక్కినేని లాంటి వాళ్లకు ఓ స్టైయిల్ వుండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైయిల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ్ల పవన్ కళ్యాణ్ స్టైయిల్ ను ఇపుడు వస్తున్న హీరోలంతా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మరో స్టైయిల్ తో వచ్చాడు. ఇప్పుడు వస్తున్న హీరోలందరూ కూడా బన్నీ స్టైయిల్ ను కాపీ కొడుతున్నారు అంటూ కామెంట్లు చేసాడు.

దాసరి మాటలకు బన్నీ కౌంటర్ వేసినట్లుగా... తాను మాత్రం మెగా ఫ్యాన్స్ ఆశీస్సుల వల్లే తాను ఈ వేదికపై వున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై నిర్మాత బండ్ల గణేష్ తన మెగా అభిమానాన్ని చాటుతూనే, దాసరిపై పరోక్షంగా భారీ కామెంట్లు చేసాడు.

రాముడు లేని రామాయణం చదవం. చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం. కాలం మారినా గుణం మారని ధృవనక్షత్రం మెగాస్టార్.
రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్ వన్ అయ్యి, మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్ చిరంజీవి.
తెలుగువారి క్యాలెండర్లో పండగలు వుంటే... తెలుగు సినీ పరిశ్రమ క్యాలెండర్లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ డేట్స్ వుంటాయి.
డాన్స్ నేర్చుకోవాలంటే, ఫైట్స్ ప్రాక్టీస్ చెయ్యాలంటే, నడవాలంటే, నిలబడాలంటే చూసే సిడీలు మెగాస్టార్ చిరంజీవి గారివి కాదా.
చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుంటాం.
boxoffice ni redifine చేసిన మెగాస్టార్ చిరంజీవి సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్  ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా
ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్ జిందాబాద్.
జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!

అంటూ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ఈ కామెంట్లన్నీ కూడా దాసరిని వుద్దేశించే బండ్ల గణేష్ ఇలా పోస్ట్ చేసాడని వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా బండ్ల గణేష్ పై కూడా సోషల్ మీడియాలో పలు కామెంట్లు వస్తున్నాయి. మరి ఈ విషయం ఇంకెంత దూరం వెళ్లనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandla Ganesh  Controversy  comments  Dasari Narayana rao  Son of Sathyamurthy  

Other Articles