మాస్టర్ జితేష్ సమర్పణలో నవదీప్ ఫిలిం క్రియేటివ్ పతాకంపై కమల్ కామరాజ్, షాయాజీషిండే ప్రధాన పాత్రలుగా జగదీష్ వటర్కర్ దర్శకత్వంలో, రాజ్ పచ్‌ఘరే నిర్మించిన మెసేజ్ ఒరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘ఫాదర్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల(ఏప్రిల్) 24న విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ పచ్‌ఘరే మాట్లాడుతూ..‘ఇటీవల జరిగిన ఏడవ నాసిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ చిల్డ్రన్ మూవీగా మా ఈ ‘ఫాదర్’ నిలిచినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి చూడాల్సిన చిత్రమిది. మంచి మెసేజ్‌తో పాటు ఉన్నత విలువలున్న ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడికి ఎంతగానో నచ్చుతుంది’ అని అన్నారు.
కమల్ కామరాజు, షాయాజీషిండే, జ్యోతి, సమీర్, ముస్తాఖాన్, వృశాలి, మాస్టర్ సాయి ప్రణీత్, బేబీ కావేరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎవ్.వి.ఎస్. నాయుడు, సంగీతం: యువరాజ్ మోరె, ఎడిటర్: మేనుగ శ్రీను, స్క్రీన్‌ప్లే-డైలాగ్స్: అనూప్ శ్రీవాత్సవ్; ఫైట్స్: నందు, ప్రొడక్షన్ కంట్రోలర్: టి. గంగాధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉజ్వల పచ్‌ఘరే, ప్రొడ్యూసర్: రాజ్ పచ్‌ఘరే, దర్శకత్వం: జగదీష్ వటర్కర్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more