Tapsee pannu shares her feelings about competition in industry | Bollywood Movies

Tapsee pannu shares her feelings about competition in industry with upcoming heroines

Tapsee pannu news, Tapsee pannu bollywood, Tapsee pannu press meet, bollywood gossips, bollywood news, Tapsee pannu affairs, Tapsee pannu controversies, bollywood heroines, telugu actresses

Tapsee pannu shares her feelings about competition in industry with upcoming heroines : Tapsee pannu says that she accept only those movie which helps her career growth and gives a good image for her.

అమ్మో.. నేనలాంటి తప్పులు చేయను!

Posted: 04/18/2015 11:55 AM IST
Tapsee pannu shares her feelings about competition in industry with upcoming heroines

ప్రస్తుతం సినీ పరిశ్రమలో తారల మధ్య పోటీ ఎక్కువైంది. అందుకే.. అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కంటిన్యూగా సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. కథ ఎటువంటిది..? హిట్ అవుతుందా? లేదా? అది తమ కెరీర్ కి ఎంత హెల్ప్ అవుతుంది? అన్న అంశాలు పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. పైగా గ్లామర్ డోస్ కూడా భారీగానే పెంచేస్తున్నారు. ఇటువంటి తారలకు మొదట్లో మంచి ఇమేజ్ లభించినప్పటికీ.. ఎక్కువకాలం దాన్ని పదిలపరచుకోలేకపోతారు. ఆ తర్వాత వారికి ఆఫర్లు రావడం కూడా కరువైపోతాయి. అయితే.. తాను అలా చేయనని.. తన కెరీర్ కి ఉపయోగపడే సినిమాలు మాత్రమే చేస్తానని అంటోంది నటి తాప్సీ!

‘ఏ రంగంలో అయినా పోటీ సహజమే కానీ.. సినీ రంగంలో ఈ పోటీ మరీ ఎక్కువగా వుంటుంది. సినిమాకో కథానాయిక పరిచయం అవుతుండటంతో, అప్పటికే ఉన్న తారలతోపాటు కొత్త తారల నుంచి పోటీ ఎక్కువ అవుతోంది’ అని ప్రధానంగా హిందీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని తాప్సీ వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ తాను తన కెరీర్ కి ఉపయోగపడే మూవీలు మాత్రమే చేస్తానని తెలుపుతోంది. ‘నాలాంటి అప్ కమింగ్ తారలు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తే అదేదో వింతలా భావిస్తారు. ఏదైనా సినిమాకి ‘నో’ అంటే చాలు, ఫీలైపోతారు. కానీ, ఏ సినిమా పడితే అది చేస్తే కెరీర్ ఎలాగోలా అయిపోతుంది. అందుకే, ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకుని, నా కెరీర్‌కి ఉపయోగపడుతుందనిపించే చిత్రాలు మాత్రమే అంగీకరిస్తున్నా’నని తెలిపింది.

హిందీ రంగం గురించి తాప్సీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఇక్కడ పోటీ ఎక్కువ. దాంతో పాటు విమర్శలూ ఎక్కువే. ఆ విమర్శల కారణంగా ఒక్కోసారి ఆత్మస్థయిర్యం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే విమర్శలను మనసు వరకూ తీసుకెళ్లకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో ఓ మూవీలో నటిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapsee pannu  bollywood heroines  telugu actresses  

Other Articles