Bahubali Movie Got Global Reputation by Editor James Marsh | Director Rajamouli

Bahubali movie global reputation rajamouli editor james marsh

bahubali movie, rajamouli, editor james march, bahubali gossips, bahubali updates, bahubali news, bahubali release dates, prabhas, daggubati rana, anushka shetty, tamannah bhatia, tollywood gossips

Bahubali Movie Global Reputation Rajamouli Editor James Marsh : Tollywood Ace Director Rajamouli's Huge Project Bahubali Has Got Global Reputation. Asian Famous Editor James Marsh written article about this movie after visits ramoji film city.

‘బాహుబలి’కి అంతర్జాతీయ గౌరవం!

Posted: 04/23/2015 11:35 AM IST
Bahubali movie global reputation rajamouli editor james marsh

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని జక్కన్న రెండు భాగాల్లో రూపొందిస్తున్నాడు. ఓ చారిత్రాత్మక కథనంతో ఎంతో భారీ వ్యయంతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. బాలీవుడ్ లో దీని హవా బాగానే కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ అధిక డబ్బులు వెచ్చించి మరీ దీని హిందీ రైట్స్ కొనుగోలు చేశాడు. అంతేకాదు.. ఓ అంతర్జాతీయ ప్రముఖ దర్శకుడు సైతం ఈ మూవీ షూటింగ్ స్పాట్ ని సందర్శించి.. జక్కన్న ప్రతిభను ప్రశింసించాడు. మొత్తానికి ఈ మూవీ రిలీజ్ కాకముందే తెలుగు ఇండస్ట్రీలోనే చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇక రాజమౌళి ఈ సినిమా మొదటి భాగాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకోరానున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా వుంది. ఆర్కా మీడియా వర్క్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తోంది.

ఇదిలావుండగా.. తాజాగా ఈ మూవీ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఈ సినిమాని సమీక్షించడానికి దర్శకనిర్మాతలు ఆసియా లెవెల్ లో ప్రఖ్యాతి సంపాదించిన ఎడిటర్ జేమ్స్ మార్ష్ ని ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో సెట్ కి ఆహ్వానించారు. అక్కడ ఈ సినిమా లొకేషన్లు, ఏర్పాటు చేసిన సెట్స్ తదితర విషయాలు తెలుసుకుని అతగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. దీంతో అతగాడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సాధించిన ఒక మేగజైన్ లో ఈ సినిమా పై ఒక ఆర్టికల్ ప్రచురించాడు. ఈ విధంగా ఈ చిత్రం అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది.

ఇదిలావుండగా.. ‘బాహుబలి’ సినిమాని ఇంగ్లీష్ లో ‘బాహుబలి – ది బిగినింగ్’ అనే పేరుతొ విడుదలచేయనున్నారు. జక్కన్న గతంలో చిత్రీకరించిన ‘ఈగ’ సినిమా ఫారెన్ లాంగ్వేజ్ లలో విడుదలైన విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali Movie  Editor James Marsh  Rajamouli  Prabhas  Anushka Shetty  

Other Articles